GET MORE DETAILS

జీవితానికి రెండు చుక్కలు

జీవితానికి రెండు చుక్కలు




ప్రతి యేడూ "పల్స్ పోలియో - జీవితానికి రెండు చుక్కలు" అని ఫ్రీగా పోలియో చుక్కలేస్తారు గదా... ఎవరివల్లంటావ్...???

అప్పుడ్లో 1950 ల కాలంలో  "జోనస్ సాల్క్" అని ఓ సైంటిస్టుండేవాడు. పోలియో మందు కనిపెట్టాక అందరూ అతన్ని మేధోసంపత్తి హక్కులు తీసుకొమ్మన్నారు. ఆయన "అది కోట్లమంది జీవితాలకు సంబందించిన మందు. దానిని డబ్బుతో ముడిపెట్టలేం. సూర్యుడికి నువ్ హక్కులు తీసుకోగలవా..." అని సలహాలిచ్చిన వారందర్నీ కాదని ఆ మందు అందరికీ ఉచితంగా అందేలా చేశాడు..

దానివల్ల ఓ లెక్క ప్రకారం ఆయన దాదాపు  "5 లక్షల కోట్ల రూపాయల" ఆదాయం వదులుకున్నట్టు. ఒకప్పుడున్నట్టు ఇప్పుడు ఏ స్కూల్లోనూ మూడు చక్రాల బళ్లు లేవు. చేతుల కింద కర్రలెట్టుకుని నడిచే పిల్లలు కనిపించట్లేదు... ఈ రోజు మనం‌ ప్రపంచంలో 99% పైగా పోలియోని తరిమికొట్టగలిగామంటే అది ఆరోజు ఆయన నిస్వార్ధంగా తీసుకున్న నిర్ణయం వలనే...

-Charlie Darwin

Remember that Legend on every pulse polio Day...

Post a Comment

0 Comments