GET MORE DETAILS

సూర్యనారాయణ స్వామి దేవాలయం : అరసవల్లి - శ్రీకాకుళం

 సూర్యనారాయణ స్వామి దేవాలయం : అరసవల్లి - శ్రీకాకుళంఅరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని అరసవల్లిలోఉన్నది  ఇది శ్రీకాకుళం పట్టణానికి దాదాపు 1 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామంలో  శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఇక్కడ లభించిన శాసనాల ద్వారా కళింగ రాజవంశం పాలకుడు దేవేంద్రవర్మ రాజు ఆలయం నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు.ఈ గ్రామములో అతి పురా తనమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ దేవాలయం ప్రక్కన ఉన్న సూర్యగుండాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికీ  నిత్య పూజలు జరుగుతున్నఆలయంలో   ఆలయంలో సూర్యనారాయణ స్వామి వారిని పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి సంతోషంతో వెళతారని నమ్ముతారు. ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ దేవాలయానికి ఎంతో ఘనమైన చరిత్ర మరియు స్ధల పురాణం ఉందని చెబుతోంది.

చరిత్ర : 

చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని  అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తున్నది. కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్య దేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తున్నది.  కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంథం దొరికిందని,ఆ గ్రంధంలో సూర్యనారాయణ స్వామి పూజా విధానాలు ఉన్నాయని వారు మహారాజుకు తెలిపినట్లు చరిత్ర చెబుతుంది. ఇప్పటికి ఈ ఆలయంలో వారి వారసులే ఆలయ పూజారులుగా కొనసాగుతున్నారు.

 ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజాం నవాబు పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదార్‌గా నియమితులైన షేర్ మహ్మద్ ఖాన్ తన హయాంలో ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు. అతను స్వయంగా పర్షియన్ లిపిలో ఉన్న శాసనం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. అలా ధ్వంసం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా ఉంది. హిందూ ధర్మశాస్త్రం మరియు మనుస్మృతి గురించి సుబేదార్‌కు చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రికి అరసవిల్లి దేవాలయంపై జరగబోయే దాడి గురించి  ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి, అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ ఉంది. ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి

స్థలపురాణం : 

కురుక్షేత్ర యుద్ధం అనంతరం బలరాముడు తీర్థయాత్రకు బయలుదేరాడు. అతను వింధ్య పర్వతాలను దాటి దండకారణ్యాన్ని దాటి మాధవ అడవిలోని పద్మనాభ పర్వత ప్రాంతములో నివసించుచున్నాడు. కరువుతో బాధపడుతున్న కళింగ ప్రజలుతమను ఈ బాధ నుండివిముక్తి చేయమని బలరాముడిని ప్రార్థింపగా అతను తన ఆయుధమైన హలము (హలముఅనగా నాగలి వలన)  భూమి పై నాటి జలధార వచ్చినట్లుగా చేశాడు.తన నాగేటి చాలుతో నాగావళి నదిని ఆవిర్భవింపజేసి ఆ తీరాన ఒక దేవాలయాన్ని నిర్మించి, అందులో స్వామివారిని ప్రతిష్ఠించాడు. నాగావళి నది ఒడ్డున బలరాముడు ఐదు ప్రత్యేకమైన శివాలయాలను నిర్మించాడు. వీటిలో నాల్గవది శ్రీకాకుళం పట్టణంలోని ఉమరుద్ర కోటేశ్వరస్వామి ఆలయం.

 ఆ వింతను తిలకించడానికి దేవతలు స్వర్గం నుంచి దిగివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇంద్రుడొక్కడు వేళకు రాలేకపోయాడు. అప్పటికే కాలాతీతమైనది. పిదప నందీశ్వరుడు,శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు దర్శించుకోవడానికి ఇది సరైన సమయం కాదని వారు చెప్పారు. అప్పుడు  ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగెను ఇంద్రుడు కోపావేశంతో వజ్రాయుధం ఎత్తగా, నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుని విసిరిపారేశాడు. ఆ దెబ్బకు అరసవిల్లి సమీపంలో స్పృహతప్పి పడిన ఇంద్రునికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై నా విగ్రహం ఇక్కడ ప్రతి స్థించి ఆరాధించమని చెప్పి అంతర్థానమయ్యాడు.

ఇంద్రుడు పడిన ప్రదేశాన్ని ఇంద్ర పుష్కరిణిగా పిలుస్తారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై "నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో త్రవ్వమని" చెప్పను. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యనారాయణ స్వామి విగ్రహం దొరికెను. ఆ విగ్రహాలతో పాటు ఉష,ఛాయ, పద్మిని అమ్మవార్ల విగ్రహాలు కూడా లభించినవి.

అక్కడే ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించెను ప్రస్తుత అరసవెల్లి క్షేత్రం ఇంద్రుడు ఆలయం నిర్మించిన ప్రదేశం.  తరువాత, శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శినం చేసుకున్నాడని ఇక్కడి స్థానిక స్థలపురాణ కధనం.

విశిష్టత :

ఈ ఆలయంలో సంవత్సరానికి రెండు రోజులు  సూర్య కిరణాలు  గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి. అరసవల్లిదేవాలయ ప్రాంగణం నుండి అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు అరసవల్లికి తరలి వస్తారు. ఆరోగ్యం కోరుకునేవారు గ్రహబాధలు ఉన్నవారు ఈ స్వామివారిని దర్శించి సేవిస్తే అన్ని సమస్యలు తీర గలవని భక్తుల నమ్మకం. ఈ దేవాలయ ముఖమండపంలో సప్తాశ్వరూఢుడయిన సూర్యుని ఏకశిలా విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.

ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 మరియు అక్టోబర్ 1, 2, 3, 4 తేదీలలో  ఉదయం 06:00 గంటల నుండి ఉదయం 06:20 నిమిషాల వరకు  చూడవచ్చు. ప్రత్యక్ష సూర్యకిరణాలు స్వామివారిని  తాకుతాయి. స్వామి పాదాల నుండి సూర్య కిరణాలు వెలువడేఅద్భుతమైన దృశ్యాన్ని చూడటం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

సూర్యనారాయణ స్వామి యొక్క ఏడు గుర్రాల పేర్లు :

1. గాయత్రి

2. బ్రూహతి

3. ఉష్నిక్

4. జగతి

5. దృష్టప్

6. అనుష్టుప్

7. భక్తి

పండుగలు మరియు ఉత్సవాలు :

రథ సప్తమి: ఈరోజు  సూర్యనారాయణస్వామి వారి విశేష పర్వదినం

కల్యాణోత్సవం: ఇది చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు 6 రోజులు జరుగుతుంది.

మహాశివరాత్రి: ఈ రోజున, ఈ దేవాలయ క్షేత్రపాలకుడైన  భువనేశ్వరితో కలిసి రామలింగేశ్వరస్వామికి ఉత్సవం జరుగుతుంది. రాత్రిపూట ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి.

డోలోత్సవం: హోలి పండుగ రోజున సాయంత్రం కామదాహనం పండుగను జరుపుతారు.

రథ సప్తమి

కళ్యాణోత్సవాలు

డోలోత్సవాలు

మహా వైశాఖి

రాఖీ పౌర్ణమి

దసరా

వైకుంఠ ఏకాదశి

జన్మాష్టమి

నరక చతుర్దశి & దీపావళి

తెప్పోత్సవం

మకర సంక్రాంతి

మహా శివరాత్రి

ఆలయ సమయాలు : 

ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 06:00 గంటల నుండి నుండి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు. మరియు తిరిగి సాయంత్రం 03:30 నిమిషాల నుండి రాత్రి 08:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

·        సుప్రభాతం: ఉదయం 05:00 గంటలకు.


·        నిత్య అర్చన:ఉదయం 05:30 గంటలకు.


·        మహా నివేదన: మధ్యాహ్నం 12:30 గంటలకు.


ఓం నమో భగవతే శ్రీ సూర్య దేవాయ నమః

Post a Comment

0 Comments