GET MORE DETAILS

BIG BREAKING: షేన్ వార్న్ మృతి

 BIG BREAKING: షేన్ వార్న్ మృతి

● థాయ్ లాండ్ లో కన్నుమూసిన వార్న్

● తన విల్లాలో విగతజీవుడిలా కనిపించిన వైనం

● వైద్య సిబ్బంది ప్రయత్నాలు విఫలం

● గుండెపోటుకు గురయ్యుంటాడని అనుమానం



ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్(52) హఠాన్మరణం చెందారు. తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడిఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ హార్ట్ ఎటాక్ కు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశారు.

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడు. 52 ఏళ్ల వార్న్ గుండెపోటుతో మరణించినట్టు  తెలుస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా పేరు గాంచిన వార్న్.. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగుతో ముప్పుతిప్పలు పెట్టాడు. వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కుప్పకూలిన వార్న్‌ను బతికించేందుకు మెడికల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  

1992-2007 మధ్య కాలంలో వార్న్ 145 టెస్టులు, 194 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 1001 వికెట్లు తీసుకున్నాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన వార్న్ వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టగా, టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్‌లోనూ ఆడిన వార్నర్ 57 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి తొలి సీజన్‌లో జట్టుకు ట్రోఫీని అందించిపెట్టాడు. టెస్టుల్లో పదిసార్లు పదికి పది వికెట్లు పడగొట్టి అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

షేన్ వార్న్ మరణవార్తతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపపోయింది. ఈ వార్తను తాను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. జీవితమంటే ఇంతేనని, దానిని అర్థం చేసుకోవడం కష్టమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నాడు. 

రిటైర్మెంట్ తర్వాత వార్న్ కోచ్‌గా అవతారమెత్తాడు. అలాగే, కామెంటేటర్‌గా, టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్‌గా మారి ఐదేళ్లుగా చాలా చురుగ్గా ఉన్నాడు. అంతలోనే అతడి మరణవార్త క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టేసింది.

క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ప్రపంచ స్పిన్ బౌలింగ్ దిగ్గజాలలో ఒకడు, ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పాలయ్యాడు. ప్రస్తుతం షేన్ వార్న్ వయసు 52 ఏళ్లు. తన నివాసంలో షేన్ వార్న్(Shane Warne) కుప్పకూలి ఉండటం గమనించిన సిబ్బంది.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. షేన్ వార్న్ హార్ట్ ఎటాక్‌తో(Heart Attack) చనిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో తమకు గోప్యత అవసరమని వార్న్ కుటుంబం పేర్కింది. మరిన్ని వివరాలను అతిత్వరలోనే అందిస్తామని వెల్లడించింది. కెరీర్‌లో 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశారు. 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. అనేక రికార్డులు షేన్ వార్న్ పేరు మీద ఉన్నాయి. వార్న్ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్ 15 సంవత్సరాల పాటు కొనసాగింది.

1992లో SCGలో తన టెస్ట్ అరంగేట్రం చేసిన వార్న్, ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టు అయినా ఆధిపత్యం వహించే గొప్ప కాలాల్లో అన్ని ఫార్మాట్‌లలో కీలక వ్యక్తిగా ఎదిగాడు. షేన్ వార్న్ 1999లో ఆస్ట్రేలియా (Australia) ప్రపంచ కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడు. 1993, 2003 మధ్య ఐదు కాలంలో ఆస్ట్రేలియా యాషెస్ గెలిచిన టీమ్‌లోనూ సభ్యుడుగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత షేన్ వార్న్ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఒకసారి ఆ జట్టు టైటిల్ గెలుచుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ జట్టుకు కోచ్‌గానూ షేన్ వార్న్ సేవలు అందించాడు. 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లు తీసిన వార్న్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్, వార్న్‌ పేరు మీద ఉన్న ఈ రికార్డ్‌ను శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ మాత్రమే అధిగమించాడు.ఆస్ట్రేలియా తరపున అన్ని ఫార్మాట్లలో 300 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు వార్న్. యాషెస్ క్రికెట్‌లో 195తో ఇతర బౌలర్‌ల కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.

Post a Comment

0 Comments