బిరజదేవి ఆలయం జాజిపూర్ - ఒరిస్సా
అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు.
ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్ రోడ్డుకు,38 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది.
◆ ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది.
◆ సింహవాహిని గా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణిగా కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.
◆ ఒరిస్సాలోని భువేనేశ్వర్‌కు 120 కిలోమీటర్ల దూరం లో ఉన్న జాజిపూర్ అనే పట్నం ఉంది. ఆ పట్నాన్ని ఒకప్పుడు జగతి కేశరి అనే రాజు పాలించాడట. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆ జగతి కేశరే ఇక్కడి గిరిజా అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించారని అంటారు.
◆ అష్టాదశ శక్తిపీఠంగానే కాకుండా ఈ క్షేత్రానికి ఇతరత్రా ప్రత్యేకతలు కూడా చాలానే కనిపిస్తాయి. వాటిలో కొన్ని...
- మహాభారత యుద్ధానంతరం ఇక్కడ భీముని గద ఉండిపోయిందట. అందుకే దీనిని గదాక్షేత్రంగా పిలుస్తారు.
- గయాసురుడు అనే రాక్షసుని దేవతలు సంహరించినప్పుడు... ఆయన తల గయలోనూ, పాదాలు పిఠాపురంలోనూ, నాభి ఇక్కడి జాజిపూర్‌లోనూ పడ్డాయని ఐతిహ్యం. అందుకే పిఠాపురాన్ని పాదగయగానూ, జాజిపూర్ క్షేత్రాన్ని నాభిగయగానూ పేర్కొంటారు.
◆ ఈ జాజిపూర్ పట్నం చివర వైతరణి నది ప్రవహిస్తోంది. ఆ వైతరణి నది తీరాన బ్రహ్మదేవుడు అమ్మవారి కోసం యజ్ఞం చేసినప్పుడు, అమ్మవారు పార్వతీదేవి ప్రత్యక్షం అయ్యిందట.
◆ ఇక్కడ గిరిజాదేవి అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో కనిపిస్తుంది. అయితే అమ్మవారి అలంకారం తర్వాత కేవలం, ఆమె మోము మాత్రమే కనిపిస్తుంది. ఈ అమ్మవారిని పూజించేందుకు ఏడాది పొడవునా ఏదో ఒక ప్రత్యేక సందర్భాలు ఉంటూనే కనిపిస్తాయి. ముఖ్యంగా మాఘ అమావాస్య నాడు అవతరించారని అంటారు. ఇక దసరా మహోత్సవాలను 16 రోజుల పాటు నిర్వహిస్తారు.
◆ బిరజాదేవి ఆలయంలో కనిపించే మరో ప్రత్యేకత అక్కడి పిండప్రదానం. బిరజాదేవి ఆలయానికి సమీపంలో ఒక బావి ఉంటుందట. ఆ బావిలో పెద్దలకు తర్పణాలను విడవడం శుభస్కరం అని ఓ నమ్మకం. ఇలా విడిచిన తర్పణాలు నేరుగా కాశీకి చేరతాయట.
◆ లక్షలాది మంది జనం ఏటా బిరజాదేవి ఆలయాన్ని చేరుకుంటారు. వారి నమ్మకాలు ఎప్పుడూ వమ్ము కాలేదన్నది భక్తుల మాట.
ఓం శ్రీమాత్రే నమః
0 Comments