గజకేసరి యోగం ప్రభావం - ఈ రాశులవారు ఏనుగు కుంభ స్థలాన్ని కొడతారు!
• 29, 30, 31 తేదీల్లో గజకేసరి యోగం ఏర్పడి మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులకు ఆదాయ, ఉద్యోగ, ఆరోగ్య, శుభ పరిణామాలు కలుగుతాయి.
• ఈ నెల 29, 30, 31 తేదీల్లో గురు, చంద్రుల మధ్య సమసప్తక దృష్టి ఏర్పడుతుంది. దీనివల్ల గజకేసరి యోగం కలుగుతుంది.
• ఈ యోగం అనుకూలంగా ఉన్నవారు తప్పకుండా ఏనుగు కుంభ స్థలాన్ని కొడతారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.
• కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు, మకర రాశిలో ఉన్న చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఈ యోగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
• ఈ యోగం ఈసారి ఆదాయ వృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఈ గజకేసరి యోగ కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలు అతి తక్కువ కాలం నెరవేరే అవకాశం ఉంటుంది.
మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులకు ఈ యోగం బాగా లాభిస్తుంది.
మేషం ఈ రాశికి ఈ గురు, చంద్రుల పరస్పర దృష్టి విశేష ఫలితాలనిస్తుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. ఆదాయం లేదా ఆస్తి సంబంధమైన నిర్ణయాలకు ఇది బాగా అనుకూల సమయం. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందు తాయి.
కర్కాటకం ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం, సప్తమంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడిని వీక్షించడం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం మంచి మలుపు తిరుగుతుంది. శత్రు, రోగ, రుణ సమస్యల మీద విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.
కన్య ఈ రాశికి ఈ గజకేసరి యోగం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. కెరీర్ పరంగా అనేక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈ మూడు రోజుల కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పకుండా కొద్ది రోజుల్లో సత్ఫలితాలనిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది.
తుల ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల పూర్తిస్థాయి గజకేసరి యోగం ఏర్పడింది. దీని వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆక స్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
వృశ్చికం ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువుతో చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు, పదోన్నతి కూడా కలుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి.
మకరం ఈ రాశిలో ఉన్న చంద్రుడితో సప్తమంలో ఉచ్ఛలో ఉన్న గురువుకి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల పూర్తి స్థాయి గజకేసరి యోగం ఏర్పడింది. దీని వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయపరంగా దూసుకుపోయే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

0 Comments