GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం



1) సీజనల్‌ వ్యాధులకు.. సింపుల్ చిట్కా

వర్షకాలంలో సీజనల్ వ్యాధులు మన రోగనిరోధకశక్తిపై దాడి చేస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు ఈ సీజన్‌లో చాలా వేధిస్తాయి. సో.. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు.. పసుపు కలిపిన పాలు రోజూ రాత్రి తాగండి. పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేసి తాగితే అనేక ఇబ్బందుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

2) వానాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా...

1. ఎక్కువ సేపు నానబెట్టకూడదు. అలా చేస్తే వాసనతో పాటు వాటి నాణ్యత దెబ్బతింటుంది.

2. వాసన వస్తుంటే వెనిగర్ వేసి రుద్దాలి. కాసేపయ్యాక నీటిలో ఉతికి ఆరేయాలి.

3. ఉతికిన వెంటనే ఆరేయాలి.

4. వర్షం పడుతుంటే ఇంట్లోనే గాలి బాగా వచ్చే కిటికీలు, వెంటిలేషన్ దగ్గర ఆరేయాలి.

5. బట్టలు ఉతికిన తర్వాత నిమ్మరసం, నీరు కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. కొద్దిసేపు గాలిలో ఉంచితే దుర్వాసనకు కారణమైన ఫంగస్ నశిస్తుంది.

3) ఎసిడిటీ రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే...

☛ ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోండి.

☛ ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తినవద్దు.

☛ బిజీ పనుల వల్ల భోజనాన్ని స్కిప్ చేయకండి.

☛ రోజూ టైమ్​ ప్రకారం తినడం అలవాటు చేసుకోండి.

☛ రాత్రి పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్​ చేయండి.

☛ మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే మంచిది.

☛ ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ తరచూ తీసుకోవద్దు.

4) ఆయుర్వేద చిట్కాలు

కడుపు ఉబ్బరం తగ్గడానికి మేలైన చిట్కా...

☛ వాము(ఓమ)ని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. రోజూ భోజనం చేసేటప్పుడు దీనిని ఉపయోగించాలి. వేడి అన్నం తీసుకుని మొదటి ముద్దలో పావు చెంచా వాము పొడి వేసుకుని తింటే కడుపుబ్బరం తగ్గుతుంది.

5) నిత్యం మెట్లు ఎక్కడం వల్ల ప్రయోజనాలు

వారానికి 3-5రోజులు నిత్యం 30నిమిషాలు మెట్లెక్కడం మంచిదని నిపుణులు అంటున్నారు. మెట్లెక్కడం వల్ల కండరాలు ద‌ృఢంగా మారతాయి. తొడలు లావుగా ఉన్నవారు రెగ్యూలర్‌గా మెట్లెక్కడం అలవాటు చేసుకుంటే మార్పు కనిపిస్తుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. మెట్లెక్కడం వల్ల నిమిషానికి 7 క్యాలరీలు ఖర్చవుతాయట. అయితే.. మెట్లెక్కడంలో వేగం పనికిరాదు. గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఉంటే మెట్లెక్కకపోవడం మంచిది.

Post a Comment

0 Comments