GET MORE DETAILS

ఇవి మీకు తెలుసా...?

ఇవి మీకు తెలుసా...?



1)  "అడవి కాచిన వెన్నెల" ఈ సామెతకు అర్థం తెలుసా ?

☛ చేసిన పని వృధా అయినప్పుడు, సరిపడా కృషి చేసినా, ఆ ప్రయత్నం నెరవేరని సందర్భాల్లో ఈ సామెతను వాడుతారు. విలువైనది అవసరం లేనిచోట ఉంటే, దాని ఉపయోగం ఉండదు కదా ! అలానే.. ప్రజలు నివసించే పల్లెల్లో వెన్నెల కాస్తే దాని వెలుతురు ఉపయోగం కానీ ఎవరు లేని అడవిలో వెన్నెల కాస్తే నిరుపయోగమవుతుందని అర్థం.

2) LAW POINT: పొదుపు ఖాతా వడ్డీపై పన్ను చెల్లించాలా ?

పొదుపు ఖాతా ద్వారా సంవత్సరానికి రూ.10 వేల వరకు వడ్డీ పొందితే అది పన్ను రహితం. 60సం.లోపు వారికి ఇది వర్తిస్తుంది. ఇక రూ.10 వేల కంటే ఎక్కువ వడ్డీ వస్తే ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80 TTA ప్రకారం 10% TDS బ్యాంకులోనే మినహాయించి మిగతాది ఇస్తారు. కాగా 60సం. దాటిన సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

3) ఓటరు కార్డు కోసం ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు.

జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండినవారు, 18లో అడుగుపెడుతున్న వారు ఈ నెలాఖరు వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. లేదా www.nvsp.in వెబ్‌సైటులో లాగిన్ అయ్యి, ఓటు నమోదు చేసుకోవచ్చు. FORM-6లో వివరాలు నమోదు చేసి కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే స్థానికంగా బూత్ స్థాయి అధికారిని సంప్రదించి.. ఓటరుగా నమోదు కావొచ్చు.

4) కరోనా కాలర్‌ట్యూన్ రావొద్దంటే.. ఇలా చేయండి !

గతేడాది నుంచి ఎవరికి కాల్ చేసినా కరోనా కాలర్‌ట్యూన్ విసుగు తెప్పిస్తోంది. అయితే కాల్ చేసినప్పుడు మీకు ఆ ట్యూన్ వినిపించిన వెంటనే 1 నొక్కండి. అప్పుడు మీకు రింగ్ వినిపిస్తుంది. ఇక దాన్ని డీయాక్టివేట్ చేయాలంటే.. BSNL: UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799కి మెసేజ్ చేయాలి. AIRTEL: CANCT అని టైప్ చేసి 144కి మెసేజ్ చేయాలి. JIO: STOP అని టైప్ చేసి 155223కి మెసేజ్ చేయాలి.

5) Cricket Facts: ఈ విషయాలు మీకు తెలుసా...

● బెయిల్స్ లేకుండా ఆడేందుకు ICC అవకాశం కల్పించింది. 2017లో భారీ గాలుల కారణంగా బెయిల్స్ లేకుండా అఫ్ఘానిస్థాన్, వెస్టిండీస్ మ్యాచ్ ఆడాయి.

● క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలింగ్ టీమ్ అప్పీల్ చేయకుండా ఔట్ ఇచ్చే అధికారం అంపైర్‌కు లేదు.

● LBW అంటే బాల్ బ్యాట్స్‌మన్ కాలుకే తాకాల్సిన అవసరం లేదు. గ్లౌవ్స్ కాకుండా.. శరీరంలో ఎక్కడ తాకినా LBWగా పరిగణిస్తారు.

Post a Comment

0 Comments