GET MORE DETAILS

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - చరిత్ర

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - చరిత్ర



అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు వినే ఉంటారు. ఇప్పటికే మీ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు మెసేజ్‌లు కూడా వచ్చి ఉంటాయి. ఇంతకీ ఇది ఎప్పుడు? దేని కోసం? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసనలు తెలిపే రోజా ?

దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది ?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది.

దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 118వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థాపకురాలు : క్లారా జెట్కిన్

 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. ఈ ఏడాది ''సమానత్వంతో ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి'' అన్నది గత సంవత్సరాల నినాదం. పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.

సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న రాజకీయ మూలం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ?

మార్చి 8వ తేదీన. అయితే, దీనికి ఒక నిర్దిష్టమైన తేదీ ఉండాలని క్లారా జెట్కిన్ భావించలేదు.

మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకోవాలి ?

1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళల దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు ?

అంతర్జాతీయ మహిళల దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. మార్చి 8కి ముందు, తర్వాత మూడు నాలుగు రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోళ్లు రెండింతలు అవుతుంటాయి.

చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది. కానీ, ఇంకా కొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఈ సగం పనిదినం అవకాశాన్ని ఇవ్వట్లేదు.

ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా 'ల ఫెస్టా డెల్ల డొన్న'ను మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహూకరించి జరుపుకుంటారు. ఈ మిమోసా పువ్వులను పంచే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు.

అమెరికాలో అయితే మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.

ఈ ఏడాది ఏం జరుగుతుంది ?

1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది (2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి  యూఎన్‌ విమెన్‌  ఈ ఏడు ప్రకటించిన థీమ్‌.. ‘‘విమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌: అచీవింగ్‌ ఏన్‌ ఈక్వల్‌ ఫ్యూచర్‌ ఇన్‌ ఏ కోవిడ్‌–19 వరల్డ్‌’’. మహిళలు నాయకత్వం వైపు అడుగులేస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించాలని యూఎన్‌ విమెన్‌ వింగ్‌ ఏటా ఒక్కో థీమ్‌తో ప్రపంచాన్ని చైతన్య పరుస్తోంది. ఆ స్ఫూర్తిని అందుకుంటున్న దేశాలున్నాయి. ఆ ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభించిన దేశాలూ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తున్న దేశాలూ లేకపోలేదు.

 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. ఈ ఏడాది ''సమానత్వంతో ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి'' అన్నది ఈ ఏడాది నినాదం.

గత ఏడాది (2020) అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా EachForEqual అనే నినాదాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు. ‘‘సమానత్వంతో కూడిన ప్రపంచమే సమర్థమైన ప్రపంచం - లింగ సమానత్వం కోసం మనలోని ప్రతి ఒక్కరూ మనవంతు కృషి చేయగలం’’ అన్నది దాని అర్థం.

2019లో "I am Generation Equality: Realizing Women's Rights" అనే నినాదాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు.

మహిళల హక్కులు, సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చర్యలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నది ఈ నినాదం ఉద్దేశ్యం.

Post a Comment

0 Comments