నయా... నానో టెక్నాలజీ. మెడిసిన్ నుంచి ఎనర్జీ వరకు...
ఏఐ అందుబాటులోకి వచ్చాక నానో టెక్నాలజీపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఆయా రంగాల్లో దీనిని ఉపయోగించుకునేందుకు అవసరమైన పరిశోధనలు, ప్రయోగాలు సైతం కొన సాగుతున్నాయి. నిజానికి ఇది అటమ్స్ అండ్ మాలిక్యూల్స్ స్థాయిలో (1 నుంచి 100 నానోమీటర్లు) మ్యాటర్ను మానిప్యులేట్ చేసే సైన్స్ అండ్ టెక్నాలజీగా చెప్పవచ్చు. నానో మీటర్ అంటే మానవ వెంట్రుక అంతటి వెడల్పు మాత్రమే ఉండే అతిచిన్న సైజు. అంటే సుమారు 80,000-1,00,000 నానోమీటర్లు. అంటే సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో చూపించిన టైనీ రోబోట్స్ కాకుండా, నిజమైన నానోటెక్ నానో పార్టికల్స్ అని చెప్పవచ్చు. ఈ సాంకేతికత నానో మెటీరియల్స్ అండ్ నానోస్ట్రక్చర్స్ తో పనిచేస్తుంది. ఉదాహ రణకు క్వాంటమ్ ఎఫెక్స్ వల్ల నానోస్కేల్లో మెటీరియల్స్ స్ట్రాంగర్, లైటర్ అండ్ మరిన్ని ఎలక్ట్రికల్ కండక్టివ్ అవుతాయి. కాబట్టి ఈ టెక్నాలజీ మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ వంటి ఫీల్డ్స్ లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
మెడిసిన్ ఫీల్డ్: నానోటెక్నాలజీ మెడిసిన్ ఫీల్డ్లో ఇప్పటికే రెవల్యూషనరీ మార్పులు తెస్తోంది. భవిష్యత్తులో మరిన్ని మార్పులకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం నానోపార్టికల్స్ ద్వారా టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సాధ్యమవుతుంది. మందులు నేరుగా క్యాన్సర్ సెల్స్ లేదా డిసీజ్ ప్రాంతానికి చేరి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తాయి. నానోసె న్సర్స్ బ్లడ్జోమ్లో రోగ కారకాలను, వ్యాధులను ముందస్తు దశలో గుర్తించి, ఇమేజింగ్ అండ్ డయాగ్నోసిస్ ను మెరుగుపరు స్తాయి. ఇవి పర్సనలైజ్డ్ మెడిసిన్, రీజెనరేటివ్ థెరపీ, వ్యాక్సిన్ డెలివరీని కూడా మెరుగుపరుస్తాయి.
ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్స్లో నానోస్కేల్ ట్రాన్సిస్టర్స్, అలాగే నానోమెటీరియల్ ఉపయోగించి (Graphene.carbon nanotubes) చిన్న, ఫాస్టర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ చిప్స్ తయారవుతున్నాయి. ఇవి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ను అడ్వాన్స్ చేస్తాయి. ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్, అలాగే ఇంప్లాంటబుల్ సెన్సార్స్ సాధ్యమవుతాయి.
ఎనర్జీ సెక్టార్: ఎనర్జీ సెక్టార్లో నానోమెటీరియల్స్ అత్యంత సమర్థవంత మైన సోలార్ ప్యానెల్స్, ఎక్కువ కాలం మన్నికగా ఉండలిగే, ఫాస్ట్గా చార్జింగ్ అవ్వగలిగే అధునాతన బ్యాటరీలను తయారు చేస్తాయి. ఇవి రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కు దోహదపడతాయి.
ఎన్విరాన్మెంట్ ఫీల్డ్: ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో నానోఫిల్టర్స్, నానోపార్టికల్స్ వాటర్ ప్యూరిఫికేషన్లో పొల్యూటెంట్స్ను రిమూవ్ చేస్తాయి. పరిశుభ్ర మైన, స్వచ్ఛమైన గాలిని అందించడంలో, కాలుష్య నియంత్రణలో సహాయపడ తాయి. ఇవి ఎన్విరాన్మెంటల్ రెమిడియేషన్ను ఎఫెక్టివ్ చేసి, సుస్థిరమైన పరిష్కా రాన్ని అందిస్తాయి.
.jpeg)
0 Comments