GET MORE DETAILS

కొత్త జిల్లాల ప్రకారమే జనగణన - కులగణనపై నిర్ణయం తీసుకోలేదు : వెల్లడించిన కేంద్ర గణాంక శాఖ

కొత్త జిల్లాల ప్రకారమే జనగణన - కులగణనపై నిర్ణయం తీసుకోలేదు : వెల్లడించిన కేంద్ర గణాంక శాఖ



దేశంలో 2021 జనగణన కొత్త జిల్లాలు, ఇతర పరిపాలన విభాగాల ఏర్పాటు. ఆధారంగా నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ తెలి పింది. ఈ ఏడాది జూన్ 30 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసి సమాచారం ఇస్తే వాటి ప్రకారమే జనగణన చేపడుతామని వెల్లడించింది. కులగణన విషయంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విజ్ఞప్తులు, అసెంబ్లీ తీర్మానాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. కోవిడ్ కారణంగా 2021 జన గణనను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు ప్రారంభించేది చెప్పలేమని వివరించింది. సీనియర్ జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ సమా చార హక్కు చట్టం (ఆర్డీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సెస్ బదులిచ్చింది. జిల్లా యూనిట్ గా తీసు కోవడంతో కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు, మెడికల్ కాలేజీలు, కృషి విజ్ఞాన కేంద్రీయ విద్యాల యాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త జిల్లాలకు కూడా నిధులు సమకూరనున్నాయి. ఎస్సీ.ఎస్టీ లకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జాబితాలోని ఉప కులాల ప్రకారం జనాభాను లెక్కి స్తామని, ఎవరైతే తమ సిబ్బంది ప్రశ్నలకు సమాధా నమిస్తారో వారినుంచి మాత్రమే వివరాలు సేకరిస్తామని స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments