GET MORE DETAILS

అనవసరంగా ఆధార్, పాన్ ఇవ్వొద్దు - మోసగాళ్లు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారు: సీబీఐసీ

అనవసరంగా ఆధార్, పాన్ ఇవ్వొద్దు - మోసగాళ్లు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారు: సీబీఐసీ



ఎవరి తోనూ అనవసరంగా ఆధార్, పాన్ వివరాలను పంచుకోరా దని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) ప్రజల నుద్దేశించి గురువారం ట్వీట్ చేసింది. ఈ వివరాలతో మోసగాళ్లు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది.కాబట్టి ఆధార్, పాన్ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గోప్యతను పాటించాలని కోరింది. అకారణంగా లేదా నగదు ప్రయోజనాల కోసమో ఈ వివరా లను ఇతరుల చేతిలో పెడితే.. దుర్వినియోగం చేస్తున్నా రని, నకిలీ సంస్థలను సృష్టించి ప్రభుత్వ ఆదా యానికి గండి కొడుతున్నా రన్నది. బోగస్ కంపెనీల పేరుతో నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను మోసపూరితంగా క్లెయిమ్ చేస్తున్నారని సీబీఐసీ వివరించింది.

Post a Comment

0 Comments