GET MORE DETAILS

రాయలసీమ కొన్ని నిజాలు...

 రాయలసీమ కొన్ని నిజాలు...



ప్రపంచంలోనే ఎర్ర చందనం పెరిగే ఏకైక ప్రాంతం – దక్షిణ నల్లమల , శేషాచలం అడవులు – ఇది పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం, కలివి కోడి (jerdon's courser) – భారతదేశంలోని critically endangered పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం (ప్రపంచంలోనే ) కడప జిల్లా లంకమల అభయారణ్యం, ప్రపంచంలోనే అతి పెద్ద బైరటీస్ నిల్వలు ఉన్న ప్రాంతం కడప జిల్లా మంగంపేట గనులు, ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూల్-కడప జిల్లాలో మొదలయ్యి ఉత్తరాదిసగా వ్యాపించింది అన్నది anthropologistsల మాట, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి గుడి ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం, రాయలసీమలో ఒక జ్యోతిర్లింగం (శ్రీశైలం మల్లికార్జున స్వామి) ఒక పంచభూత లింగం (శ్రీకాళహస్తి –వాయు లింగం) అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి (శ్రీశైలం భ్రమరాంబిక )నవ నారసింహ క్షేత్రాలలో రెండు (కదిరి లక్ష్మీ నరసింహ స్వామి మరియు అహోబిలం నరసింహ స్వామి )నవ 
నందుల నిలయమైన ,మహానంది, అగస్త్య మహర్షి పరమశివున్ని సతీసమేతంగా దర్శనం చేసుకున్న యాగంటి క్షేత్రం, రాఘవేంద్ర స్వామి వెలసిన మంత్రాలయం క్షేత్రం, శివ, కేశవ నిలయం ఉరుకుంద క్షేత్రం కలవు... ప్రపంచంలోనే అతి పురాతన లింగం (మొట్టమొదటి లింగం ) చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో కలదు, తెలుగు భాష మొదటి శాసనం – కడప జిల్లా కలమళ్ళ శాసనం, మన జాతీయగీతం మన మదనపల్లి లో రాయబడింది, తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్ళపాక తిమ్మక్క, దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు – మన శ్రీశైలం టైగర్ రిజర్వు కదిరి దగ్గరి తిమ్మమ్మ మర్రిమాను దక్షిణభారతంలో అతి పెద్ద చెట్టు కడప జిల్లాలో దేశంలోనే అతి పెద్ద Crysotile Asbestos నిల్వలుకలవు తెలుగు సినిమా పుట్టినిల్లు మన సురభి గ్రామం (కడప జిల్లా) ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికంటే ముందే బ్రిటిష్ వారిపై తిరిగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారు కర్నూలు జిల్లా బెలుం గుహలు దేశంలోనే రెండవ పెద్ద గుహా సముదాయాలుగా పేరుపొందాయి.

ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద జిల్లా మన అనంతపురం జిల్లా... ఇంకా ఇంకా రాయలసీమ అంటే ... వేమన్న పద్యం , అన్నమయ్య కీర్తన , మొల్ల రామాయణం , వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం , కన్నప్ప భక్తీ , అష్టదిగ్గజ వైభవం , రాయల రాజసం , బుడ్డా వెంగల్ రెడ్డి దాతృత్వం , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం , తరిగొండ వెంగమాంబ భక్తి , గడియారం వెంకటశేష శాస్త్రి , పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం , లక్కోజు సంజీవ రాయ శర్మ మేధస్సు , జిడ్డు కృష్ణమూర్తి తత్త్వం నా తల్లి రాయలసీమ ... సంస్కృతీ కళల పట్టుగొమ్మ... రాయలసీమ అంటే రాళ్ళు రప్పలు , కరువులు , ఫ్యాక్షన్ హత్యలు తప్ప ఇంకేమి లేదనుకోనేవారి కోసం కళ్ళు తెరిపించాలనే ఈ పోస్ట్!


ననుగన్న నా తల్లిరాయలసీమ

రతనాలసీమ...




Post a Comment

0 Comments