GET MORE DETAILS

అన్ని రోగాలకూ విరుగుడు మనసే...

అన్ని రోగాలకూ విరుగుడు మనసే...జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్యసమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని మన జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చిచెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసుబాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు.

అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.

ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టురైకేస్ వాక్  చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.  

మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్: కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !

ఆవేశ కావేశాల వల్లే అధికరక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే  అధికరక్తపోటు ఎక్కువట !

అతిబద్ధకం వల్ల చెడుకోలెస్టరాల్: కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!

మధుమేహం సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !

అతివిచారం వల్ల ఆస్త్మా: ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తా వస్తుందట. 

ప్రశాంతత లేక గుండెజబ్బులు: ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం...

50% ఆధ్యాత్మికత లోపంవల్ల

25% మానసిక కారణాల వల్ల

15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల

10% శారీరక కారణాల వల్ల

రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపుమాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే...

స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి.

కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి.

Post a Comment

0 Comments