GET MORE DETAILS

అరుదైన సమాచారం. ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.


 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు : (1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

 వేదాలు : (1) ఋగ్వే దం, (2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు : (1) ధర్మ, (2) అర్థ,(3) కామ,(4) మోక్షా

 పంచభూతాలు : (1) గాలి, (2) నీరు,(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

పంచేంద్రియాలు : (1) కన్ను, (2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.

లలిత కళలు : (1) కవిత్వం,(2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.

పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,(3) గోదావరి, (4) కావేరి, 

(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు : (1) మందారం, (2) పారిజాతం, (3) కల్పవృక్షం, 

(4) సంతానం, (5) హరిచందనం.

పంచోపచారాలు : (1) స్నానం,(2) పూజ, (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, (5) నమస్కారం.

 పంచామృతాలు : (1) ఆవుపాలు, (2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 

(5) తేనె.

పంచలోహాలు : (1) బంగారం, (2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.

పంచారామాలు : (1) అమరావతి, (2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, (3) చేదు, (4) వగరు, 

(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు  షడ్గుణాలు: (1) కామం, (2) క్రోధం, (3) లోభం, (4) మోహం, (5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ, (3) వర్ష, (4) శరద్ఋతువు, (5) హేమంత, (6) శిశిర

సప్త ఋషులు : (1) కాశ్యపుడు, (2) గౌతముడు,  (3) అత్రి, (4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ, (6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి, (2) నీలాద్రి, (3) గరుడాద్రి, 

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, (6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం, (2) మద్యం, (3) దొంగతనం, (4) వేట, (5) వ్యభిచారం, (6) దుబారఖర్చు, (7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు : (1) గంగ, (2) యమునా,  (3) సరస్వతి, (4) గోదావరి,  (5) సింధు, (6) నర్మద,  (7) కావేరి.

నవధాన్యాలు : (1) గోధుమ, (2) వడ్లు,  (3) పెసలు, (4) శనగలు, (5) కందులు, (6) నువ్వులు, (7) మినుములు, (8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం, (2) పగడం, (3) గోమేధికం, (4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, (7) కనకపుష్యరాగం, (8) పచ్చ (మరకతం), (9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం, (2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, (5) ఇనుము, (6) కంచు, (7) సీసం, (8) తగరం, (9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, (3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, (6) భయానక, (7) బీభత్స, (8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి, (2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,(4) కూష్మాండ, (5) స్కందమాత, (6) కాత్యాయని, (7) కాళరాత్రి, (8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు : (1 ) వివాహం, ( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , (4 ) సీమంతం, (5) జాతకకర్మ, (6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, (8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, (10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య, (2) కూర్మ, (3 ) వరాహ, (4) నరసింహ, (5) వామన, (6) పరశురామ, (7) శ్రీరామ, (8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, (3) మంగళ, (4) బుధ, (5) గురు, (6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం, (2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, (5) శ్రావణం, (6) భాద్రపదం, (7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, (9) మార్గశిరం, (10) పుష్యం, (11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు : (1) మేషం,(2) వృషభం, (3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల, (8) వృశ్చికం, (9) ధనస్సు, 

(10) మకరం, (11) కుంభం, (12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, 

(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 

(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, 

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 

(12) ద్వాదశి, (13) త్రయోదశి, 

(14) చతుర్దశి, 

(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, 

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 

(6) ఆరుద్ర, (7) పునర్వసు, 

(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 

(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 

(19) మూల, (20) పూర్వాషాఢ, 

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 

(23) ధనిష్ఠ, (24) శతభిషం, 

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 

(27) రేవతి.

Post a Comment

0 Comments