GET MORE DETAILS

మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ బలంతో ఉంటారు. ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు. ఎందుకిలా...?

మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ బలంతో ఉంటారు. ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు. ఎందుకిలా...?



ప్రకృతి సహజంగా మగవారికి, ఆడవారికి కొన్ని తేడాలున్నా బలాబలాల్లోను, దృఢత్వంలోనూ పెద్ద తేడా ఉండదు. కానీ లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధమైన సహజ లక్షణాలకి తోడుగా సామాజికాంశాలు ప్రభావం చూపడం వల్ల ఆడవారి శరీర పరిమాణం మగవారి కన్నా చిన్నగా, నాజూకుగా తయారైంది. ఆ మేరకు ఆహార అవసరం కొంత తగ్గినా శ్రమ విషయంలో ఆడవారు తక్కువేమీ కాదు.

ప్రపంచవ్యాప్తంగా మానవాళి చేసే అన్ని రకాల సామాజిక, ఉత్పత్తి సంబంధ శ్రమలో ఆడవారి పాత్రే అరవై శాతంగా ఉందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా చూస్తే ఆహారపు అవసరం ఆడవారికే అధికం. కానీ సమకాలీన సామాజిక, సంస్కృతిక నేపథ్యం ఆడవారిని సన్నగా, నాజూగ్గా ఉండాలని ప్రేరేపిస్తోంది. ఇది ఫ్యాషన్‌ కాదు. ఏమైనా ఆడవారు మగవారి కన్నా దేహదారుఢ్యంలో అబలలు కారు.

Post a Comment

0 Comments