GET MORE DETAILS

జలియన్ వాలాబాగ్ మారణ హోమం : 1919 ఏప్రియల్ 13

జలియన్ వాలాబాగ్ మారణ హోమం : 1919 ఏప్రియల్ 13  



మనదేశ చరిత్రలో పెద్ద విశాద సంఘటన.నాటి అమరులకి విప్లవ నివాళులు తో ఆసంఘటనకు సంబందించిన కొంత సమాచారం.

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన విశాదసంఘటన.

 అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ .....అక్కడ ఓ చిన్నతోటలో  .... రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.

ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో సైన్యం ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది.  దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది.

 బ్రిటీషు ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది.ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచి వేయడానికి వైస్రాయ్ లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. ప్రెస్ నోళ్ళను కట్టేయడానికీ, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

1919, ఏప్రిల్ 13న పంజాబ్  రాష్ట్రంలోని అమృత్‌సర్ లోగల 

స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశ మయ్యారు. జలియన్ వాలాబాగ్ అనేది   అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట..

అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం మరియు అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్, మరియు సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం.

శాంతీయుతంగా  ఈసమావేశాం జరుగుతుండగా..... జనరల్ డయ్యర్ సారధ్యంలో బ్రిటీషుఇండియా  ఆర్మీ కి చెందిన వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు , వారితో బాటు రెండు సురక్షిత armoured cars  అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి. ఆసమయంలో

బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన  నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. 

అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. వాస్తవానికి అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఆ దుష్టులు 6వారాల పసికందును కూడా వదలలేదు.

 నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు.

తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చిందని డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.

ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.

"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడి నయ్యుండేవాడిని." — (హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన)

అంతే గాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు.

 జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు.

భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది.

భగత్ సింగ్ తో బాటు  ఉద్దాం సింగ్ వంటి పలువురు విప్లవకారులుగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం.

విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు.

మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్‌ను క్రింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. 

కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు.

 బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరశిస్తూ తీర్మానాలు చేశారు.

ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు.

కొందరు బ్రిటిష్‌వారు మరియు కొంత బ్రిటిష్ పత్రికారంగం డయ్యర్ కర్తవ్య నిరతిని మెచ్చుకొన్నారు. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. 

1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ ఇతర నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. 

ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించు కోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం.

ఈ సందర్భంగా మనం ఓ విప్లవ కిశోరాన్ని ఆయన ధైర్య సాహసాలను గుర్తుకు తెచ్చుకోక పోతే జనరల్ డయ్యర్ చర్యలకు ముగింపు ,భారతీయుల పౌరుషం గురించి తెలియకపోతుంది.

ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తిని చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు. 

 దీనికి కారకుడైన  జనరల్ ఓ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవకార్యక్రమా లలో పాల్గొన్నాడు.

జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయన మవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు.తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడ సాగాడు.. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.

ఆరోజు 1940 జూలై 13....

 ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. ఆ సమాచారం  ఆయువకునికి అందింది...  వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్  సంపా దించాడు.

ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో  ఫిస్టల్  దాచాడు..అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు 

ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు.

సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు,ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు.

అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..

రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.. కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు.

ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. 

ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు.

నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ  అప్రమత్తమ య్యేందుకు లేచాడు. 

అంతే ఆయువకుడు  పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి ,అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు.. భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు.

వేలమందిని చంపి భారతీయులు  నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... ఆ జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు. 

ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడాయువకుడు...

ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా...?

షంషేర్ ఉద్దామ్ సింగ్ ...

జలియన్ వాలాబాగ్ సంఘటన.. గుండెలు పిండే సంఘటన.. ఎంతో మంది  దేశభక్తుల నెత్తురు పారిన ఘటన. భారత దేశం ఉన్నంత వరకు  ఆనాటి  బుల్లెట్ల గాయాల్ని  మరచి పోదు.. వందేమాతరం. 

జై హింద్

Post a Comment

0 Comments