ఉద్యోగార్థులు , విద్యార్థులకు ఆలిండియా రేడియో ప్రత్యేక కార్యక్రమం : ప్రతి శనివారం ఉదయం 9.30 గం.లకు ప్రసారం
వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులు , విద్యార్థుల కోసం ఆలిండియా రేడియో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది . ప్రతి శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు ' అభ్యాస్ ' పేరుతో 100.1 ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ ద్వారా ఇది ప్రసారం కానుంది . తొలి రోజు ' ఆధునిక భారత చరిత్ర ' అంశంపై చర్చను నిర్వహించినట్లు ఆలిండియా న్యూస్ సర్వీస్ విభాగం ఒక ప్రకటనలో తెలిపిందే . హిందీలో ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ట్విటర్ , యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా శ్రోతలకు అందుబా టులో ఉంచుతున్నట్లు పేర్కొంది . వచ్చే వారం ' భారత రాజకీయాలు రాజ్యాంగం ' అంశంపై కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది . సందేహాల నివృత్తి కోసం వాట్సప్ నంబరు 9289094044 లో విద్యార్థులు సంప్రదించవచ్చు.
0 Comments