GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం



1. జాజికాయతో ఎన్ని ప్రయోజనాలో...

● జాజికాయ పొడిని సూప్‌లో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబద్దకం, గ్యాస్ సమస్య, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

● జాజికాయ నూనె నొప్పులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

● దంతాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్, కిడ్నీల్లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి.

2. చెరుకు రసం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి...

వేసవి కాలంలో చాలా మంది చెరుకు రసం తాగేందుకు ఇష్టపడుతారు. అయితే చెరుకు రసం తీసే మిషన్, పరిసరాల శుభ్రత గమనించాలి. కొన్ని చోట్ల మిషన్‌లోని ఆయిల్, గ్రీజ్.. రసంతో పాటు గ్లాసుల్లో పడుతాయి. దీనివల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఇక చెరుకుతో పాటు అల్లం, నిమ్మకాయ కలిపి రసంలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ కంటే చెరుకు రసం తాగడం మేలు.

3. మెదడు ఆరోగ్యానికి ఆహారం

☛ ఐర‌న్‌, యాంటీ ఆక్సిడెంట్స్ స‌మృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్స్‌ తీసుకుంటే డిప్రెషన్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

☛ బాదంపప్పు, జీడిప‌ప్పు, వాల్‌న‌ట్స్‌, పిస్తాల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మెద‌డు ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి.

☛ పాల‌కూర‌, బ‌చ్చ‌లికూర‌, గోంగూర‌, కొత్తిమీరను ఆహారంలో తీసుకుంటే జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.

☛ ఆవకాడో, ద్రాక్ష, చేపలు, పసుపు, అల్లం, కుంకుమపువ్వు తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

4. అజీర్ణ సమస్యకు ఆయుర్వేద చిట్కాలు

☛ ఆయుర్వేద షాపుల్లో దొరికే శంఖ భస్మం, శొంఠి పొడిని సమానంగా కలుపుకోవాలి. ఈ పొడిని నిల్వచేసుకుని, ఒక గ్లాసు నీటిలో ఒక గ్రాము చొప్పున కలుపుకుని రోజూ రెండు పూటలా తాగాలి.

☛ గింజలు లేని ఎండిన నల్ల ద్రాక్ష, కరక్కాయలను సమానంగా తీసుకుని, ఇందులో కాస్త తేనె కలిపి బాగా నూరాలి. ఈ మిశ్రమాన్ని ఉసిరికాయంత ఉండలుగా చేసుకోవాలి. పూటకు ఒకటి వేడినీళ్లతో మింగాలి.

5. భుజంగాసనంతో ఉపయోగాలివే...

చేసే విధానం: బోర్లా పడుకోవాలి. రెండు చేతులను ఛాతీకి దగ్గరగా నేలమీద ఉంచాలి. కొద్దిగా శ్వాస పీల్చి, తలపైకి ఎత్తి నడుమును వీలైనంత వెనుకకు వంచాలి. ఉండగలిగినంత సేపు ఉండి మెల్లగా తలను నేలపై ఆనించాలి.

ఉపయోగాలు: అజీర్తి, ఉదరసంబంధ, మూత్రాశయ సమస్యలు తగ్గిపోతాయి. పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంటుంది. స్త్రీలకు పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

Post a Comment

0 Comments