Ads Area

స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను ?

0

స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను ?



మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో ఒక నూలు పోగు పోయినాసరే , శని , మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం , మరణయోగం , లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు త్రాడు కట్టుకొనవలెను.

(మాంగల్యం పసుపుత్రాడులో కట్టుకొనటమే విశేషము)


2. స్త్రీలు రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వినాయకునికి నమస్కరించవచ్చునా?

రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవచ్చును.


3. సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చునా?

నుదుట కుంకుమ పెట్టుకుని దానిపైన చిన్నగా విభూతి పెట్టుకొనవచ్చును. చందనం కంఠానికి రాసుకోవలెను.


4. భర్త , పిల్లల ఆరోగ్యం , కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి ఒక రోజు ఏ దేవతకి పూజ చేస్తే మంచిది?

శుక్రవారం అమ్మవారి పూజ చేయవలెను . దేవాలయంలో పరాశక్తి అర్చన చేయవలెను . క్షేమం కలుగుతుంది.


5. కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి నేను ఏ స్తోత్రాలు చదవాలి?

మీరు ప్రతిరోజు పారాయణం చేయవలసిన స్తోత్రం

”విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం 

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి!”

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area