GET MORE DETAILS

అన్నమాచార్యులు

 అన్నమాచార్యులు




అన్నమయ్య  నారాయణ సుారి, లక్కమాంబ దంపతులకు తాళ్ళపాకలో జన్మించాడు. తన పదహారవ యేట నుండి పాటలు పాడుతుా ఉండేవాడు. శ్రీవేంకటేశ్వరుని దర్శించడానికి తిరుమలకు వెళ్లి అక్కడే ఉంటుా రోజుకో సంకీర్తన పాడుతుా గడిపాడు.

తదుపరికొంత కాలానికి తిమ్మక్క, అక్కమ్మ లను వివాహం చేసుకోగా పెదతిరుమలా చార్యుడు, నృసింహకవి జన్మించారు.

ఒక సందర్భంలో పెనుకొండను పాలించే సాళ్వనరసింహ రాయుడు తన ఆస్థానంలో స్థానమిచ్చితనపై  పాటలు పాడమని కోరగా నిరాకరించాడు. అందుకుగాను అన్నమయ్యను చెరసాలలో బంధించాడు.చివరికి తప్పు తెలుసుకుని విడిపించాడు.

అన్నమయ్య తన శేషజీవితాన్ని వేంకటేశ్వరుని సన్నిధిలో గడుపుతుా 32000 సంకీర్తనలు పన్నెండు  శతకాలు వ్రాసాడు.

ప్రస్తుతం 12000 కీర్తనలు మరియు శ్రీవేంకటేశ్వర శతకం మాత్రమే లభించాయి. తొంబది ఐదు సంవత్సరాల సుధీర్ఘ జీవితాన్ని గడిపిన తర్వాత స్వర్గస్తుడయ్యాడు.

జీవితకాలం: పదిహేనవ శతాబ్దం 

బిరుదులు:

 1.పదకవితా పితామహుడు

 2.సంకీర్తనాచార్యుడు మొదలైనవి.

రచనలు:

1.మంజరి ద్విపద

2.సంకీర్తనా లక్షణం

3.శృంగార మంజరి.

4.శ్రీ వేంకటేశ్వర శతకం మొదలు పన్నెండు శతకాలు.

 భార్య తిమ్మక్క రచన : సుభద్రా కళ్యాణం

జో అచ్యుతానంద జోజోముకుంద అనే జోలపాట ఒకప్పుడు పసిపాపలను నిద్రపుచ్చింది.

కుల వివక్షకు వ్యతిరేకంగా బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే పాటను వ్రాసి  ఏకత్వాన్ని ప్రపంచానికి చాటాడు.

Post a Comment

0 Comments