నేడు వైశాఖ శుద్ధ చతుర్దశి సహిత పౌర్ణమి చిన్నమస్తా దేవి జయంతి శుభాకాంక్షలు.
చిన్నమస్తా దేవి :
ప్రత్యాలీఢపదాం సదైవ చిన్నం శిరః కర్ణికాం దిగ్వస్త్రాం స్వ కబంధ శోణిత సుధాధారాం పిబన్తీం ముదా| నాగాబద్ద శిరోమణీం త్రినయనాం హృద్యు త్పలాలంకృతాం రత్యాసక్త మనోభవోపరి దృఢాం ధ్యాయేత్ జప సన్నిభామ్ ||
ఆమె రతీ మన్మథుల మిథునముపై నగ్నముగా నిలబడి ఉంది. మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశించడం వలన ఆమె నగ్నముగా ఉన్నట్లు కనబడటం సాధ్యం కాదు. తలలేని మొండెముతో నుంచి ఒక చేతితో తన ఖండిత శిరస్సును , రెండో చేత్తో ఒక కత్తెరను పట్టుకొని నిలబడి ఉంది.
శిరస్సు లేని మెడనుండి మూడు రక్త ధారలు పైకి ఎగసి పడుతుండగా మధ్య రక్తపు ధారను తన ఖండించబడిన శిరస్సునందలి నోరు త్రాగుతూ మొండెమునకు ఇరువైపులా నిలబడి ఉన్న ఆమె పరిచారికలు మిగిలిన రెండు రక్త ధారలను తాగుతున్నట్టు కనబడుతుంది. ఇది చిన్నమస్తా దేవి రూపం.
ఈమెకు ఐంద్రీశక్తి, ప్రచండ చడిక, వజ్రవైరోచనీ అనే పేర్లు కూడా ఉన్నాయి. రమణ మహర్షి శిష్యులు వాశిష్ట గణపతి ముని చిన్నమస్తా దేవి ఉపాసన చేసి దేవి యొక్క దర్శనం చేసుకున్నారు. వారి కఫాలం పైన ఉన్న భ్రహ్మరంద్రం చిట్లగా చూసే వారికి ఒకానోక అనితరసాధ్యం అయిన కాంతిపుంజం వారి తలపై నిరంతరం కనబడేది.
ప్రకాశ నాదముల లేదా కాంతి శబ్దముల సమ్మేళం ద్వారా ఆవీర్భవించు సృష్టి ప్రక్రియనే భగవతి చిన్నమస్తా దేవి ప్రకటనం అని తాంత్రీకులు చెబుతారు.
కాంతి శబ్దముల సమ్మేళం ద్వారా ఉరుములు, మెరుపులు ఉత్పన్నం అవుతాయి. ఉపనిషత్తులు పేర్కొన్న ''విద్యుల్లేఖేవభాస్వరా'' ఆమె రూపం. ఆమెను విద్యుత్ తో కూడిన మెఱుపనీ చెప్పవచ్చు. కుండలినీ యోగసాధనలో మానవధేహం యందు మూలాధార చక్రము వద్ద ఉన్న సర్పాకార కుండలినీ శక్తి ఊర్వ్థ ప్రయాణము చేస్తూ భ్రమ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంది ఆనబడే మూడు గ్రంధులను భేధనం చేసి సహస్రార చక్రమును చేరుకోవాలి. రుద్ర గ్రంధి భేధనం భ్రూమధ్యం వద్ద ఉన్న ఆజ్ఞాచక్రం వద్ద జరుగుతుంది. ఆజ్ఞా చక్రము చేరుకునే వరకు సాధకునికి ఇంద్రియాలతో సంబంధం ఉంటుంది. సహస్రార మును చేరుకొను తర్వాత ప్రయాణం ఇంద్రియాతీతంగా ఉంటుంది. లలితా సహస్రనామ లలో కూడా రద్ర గ్రంథివిభేదిని ఆ తర్వాత సహస్రారాంబుజారూఢా గమనించాలి. ఈ చిన్నమస్తా దేవి రూపం తలలేని మొండెముతో ఉండటం భౌతిక ప్రపంచం తో సంబంధంను లేక ఇంద్రియ వ్యవహార సంబంధం లేకుండా ఉండటానికి సంకేతంగా గ్రహించాలి. ఇలాంటి స్థితిని సాధకులు చేరుకుంటే కానీ చిన్నమస్తా దేవి దర్శనం కాదు.
ఈ చిన్నమస్తా దేవి యొక్క శక్తి వెన్నెముకలో మధ్యస్థంగా ఉన్న సుషుమ్నా నాడి ద్వారా ప్రసరిస్తుంది.సుషుమ్నకు ఇరువైపులా ఇఢా, పింగలా నాడుల ద్వారా ప్రసరించే శక్తులను వర్ణినీ, డాకినీ అనే పరిచారికలు.
0 Comments