GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

 ఆరోగ్యమే మహా భాగ్యం 
 1.  యోగా: నడుమునొప్పిని తగ్గించే మకరాసనం : 

నడుము, మెడనొప్పితో బాధపడేవారు మకరాసనం వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్‌పై ఎక్కువసేపు పనిచేసే వారు, పుస్తకాలు చదివేవారు మెడ, నడుము నొప్పితో బాధపడుతుంటారు. అలాంటివారు మకరాసనం వేయాలి. మకరాసనం వల్ల మోకాళ్ల నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. పొట్ట కండరాలు బలపడతాయి. మకరాసనం వేసే పద్ధతిని పైన ఉన్న వీడియో బటన్ క్లిక్ చేసి చూడండి.


 2. ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :

● గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

● కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

● ఖర్జూరలో కాపర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడుతాయి.

● నిద్రలేమిని దూరం చేస్తుంది.

● పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుదలకు తోడ్పడుతుంది.


 3. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ?

క్యాబేజీలో విటమిన్ కె, సి, బి6, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే క్యాలీఫ్లవర్‌లో ఉండే పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ సి, కె, బి.. కిడ్నీల సంరక్షణకు దోహదపడతాయి. ధనియాలు, స్ట్రాబెర్రీ కూడా కిడ్నీలు సక్రమంగా పనిచేసేలా చూస్తాయి.

4. గుండె ఆరోగ్యం కోసం వీటిని తినండి :

● చిక్కుళ్లు, పప్పుధాన్యాలు తినండి.

● ఆహారంలో ఓట్స్, బ్రౌన్ రైస్ ఎక్కువగా ఉండేలా చూడండి.

● పుట్టగొడుగులు, ఆకుకూరలు తీసుకోవాలి.

● డార్క్ చాక్లెట్లు, బాదంపప్పు తినాలి.

● గ్రీన్ టీ, చేపలు కూడా తీసుకోవాలి.

● వాల్ నట్స్, వెల్లుల్లి తినాలి.

5. వర్కవుట్‌లకు సమయం లేదా ? ఇలా చేయండి :

మీ ఆఫీసు పనినుండి 3 నిమిషాలు విరామం తీసుకోండి. గంటకు ఒకసారి మెట్టు ఎక్కడం చేయండి. లేకపోతే సమయం దొరికినప్పుడు చేయండి.

వర్క్‌ఫ్రం హోం చేస్తే ఏమాత్రం సమయం దొరికినా 5-10 పుషప్‌లు చేసి పనిని కొనసాగించండి.

జంపింగ్ జాక్స్ మరొక అద్భుతమైన పూర్తి శరీర వ్యాయామం. మీ కండరాలను బలోపేతం చేయడానికి, శరీరం చురుకుగా ఉండటానికి కనీసం 30 జంపింగ్ జాక్‌లను చేయవచ్చు. ఈ మినీ వర్కవుట్‌లతో శరీరం చురుకుగా ఉంటుంది.

6. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ? ఇలా చేయండి :

● పులుపు, వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవద్దు.

● ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడుతాయి.

● వాతాన్ని పెంచే ఆహారాన్ని తినడం మానేయండి.

● ఒత్తిడితో కూడిన జీవితానికి కొద్దిగా విరామం ఇవ్వండి.

● నెయ్యి, ఆలివ్ నూనెతో చేసిన ఫుడ్ తినండి.

● అశ్వగంధ, పసుపు, అల్లం ఎక్కువగా ఉపయోగించండి.


7. జామ ఆకులతో ఎన్ని ప్రయోజనాలో...

● జలుబు, దగ్గు, శ్వాససమస్యలు, పంటినొప్పి, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

● జామ ఆకుల రసం తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

● మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

● జామ ఆకులతో చేసిన టీ స్పెర్మ్ ప్రొడక్షన్‌లో సాయపడుతుంది.

● జామ ఆకుల పేస్ట్‌ను తలకు అప్లై చేస్తే జట్టు పెరుగుతుంది.


8. నిద్రలేమితో బాధపడుతున్నారా ?

దేశ జనాభాలో 47శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని AIG హాస్పిటల్స్ తన పరిశోధనల్లో వెల్లడించింది. నాణ్యమైన నిద్రలో 3 అంశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. నిద్రలోతు, వ్యవధి, కొనసాగింపుగా చెప్పారు. నిద్ర ఆటంకం లేకుండా సాగాలన్నారు. నిద్రలేమి వల్ల గుండె సమస్యలు, నరాల బలహీనత, బరువు పెరగటం శరీర వృద్ధాప్య ప్రక్రియ పెరగటం వంటి సమస్యలు వస్తాయని వివరించారు. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని సూచించారు.


9. ఈ ఫుడ్ తింటే ప‌దేళ్లు ఎక్కువగా బ‌త‌కొచ్చు!!

పప్పుధాన్యాలు, ముడిబియ్యం, గోధుమ, పల్లీలు, బాదం, జీడిపప్పు లాంటి సంప్రదాయ దినుసులను ఆహారంలో చేర్చుకుంటే.. జీవన ప్రమాణం కనీసం పదేళ్లు పెరుగుతుందని ‘గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్‌’ సర్వే తేల్చింది. మాంసాహారం తగ్గించాలని సూచించింది. ఆహార సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటీ పదిలక్షల మరణాలు సంభవిస్తున్నాయి. సంప్రదాయ ఆహారంతో స్త్రీలు 10.7 ఏళ్లు, పురుషులు 13 ఏళ్లు ఆయుష్షు పెంచుకోవచ్చని సర్వే తెలిపింది.


10. ఉలవల పొంగనాలు తింటున్నారా ?

● ఉలవల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు లభిస్తాయి.

● ఫైబర్ ఉండటం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.

● వీటిని తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు.

● లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

● జీర్ణశక్తి మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. 

Post a Comment

0 Comments