GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం 




1. వేసవిలో కర్బూజతో ఉపయోగాలు :

వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డీహైడ్రేష‌న్‌, ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరం తేమ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. హైబీపీని తగ్గించి గుండెను సుర‌క్షితంగా ఉంచుతుంది. కంటి చూపు మెరుగు ప‌రిచి క‌ళ్ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. కర్బూజ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది.

2. వేసవిలో ఇలా చేయండి :

☛ రోజుకు మూడు లీటర్ల మంచి నీటిని తాగాలి. ఫ్రిజ్‌లో ఉంచిన ఓవర్‌ కూల్డ్‌ వాటర్ కంటే గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు లేదా మట్టి కుండలో నీరు తాగితే మంచిది

☛ కొబ్బరి నీరు లేదా రోజుకు అర లీటరు మజ్జిగ తాగాలి.

☛ స్నానానికి చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. మరీ వేడి నీటితో స్నానం వద్దు.

☛ వ్యాయామం దేహానికి మంచిదే, కానీ ఈ వేసవిలో శరీరం నీరసించే స్థాయిలో వ్యాయామం మంచిదికాదు.

3. సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు :

* వేసవి నుంచి తట్టుకునేందుకు సబ్జా గింజల పానీయం మంచిగా పనిచేస్తుంది.

* అధిక బరువు, మలబద్దకం, డయాబెటిస్, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

* శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం పుష్కలంగా లభిస్తాయి.

* మహిళలకు ఫోలెట్, నియాసిన్, విటమిన్ సి లభిస్తాయి.

* రక్తం శుద్ధి అయ్యేందుకు ఉపయోగపడుతుంది.

4. మామిడి కాయతో రోగాలు పరార్ :

మామిడి కాయల కాలం వచ్చేసింది. మామిడికాయ తినడం లేదా వాసన చూడటం వల్ల గర్భిణులకు వికారం తగ్గుతుంది. మామిడి ముక్కలపై కాస్త ఉప్పు చల్లుకుని తింటే శరీరం నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది. మామిడి రసాన్ని మరిగించి తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు. పచ్చి మామిడి కాయలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రక్త హీనతను తగ్గిస్తాయి.

5. వేసవిలో పచ్చి ఉల్లితో ప్రయోజనాలు :

* ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయను తింటే చిగుళ్ల సమస్యను తొలగిస్తుంది.

* ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.

* ఉల్లిపాయలో ఎముకలు బలహీనపడకుండా నిరోధించే గుణాలు ఉన్నాయి.

* శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

* ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

* మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.


Post a Comment

0 Comments