GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం 



1. వేసవిలో ఇవి తాగితే బెటర్ :

వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు మంచి నీటితో పాటు మరికొన్ని పానీయాలను తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. సమ్మర్‌లో చెమట రూపంలో కోల్పోయిన పోషకాలు తిరిగి పొందేందుకు కొబ్బరి నీళ్లు బెస్ట్ ఛాయిస్. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం డీహైడ్రేషన్‌ను తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. వీటితో పాటు గ్రీన్ మ్యాంగో జూస్, బటర్ మిల్క్, లస్సీ, నిమ్మ నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

2. సమ్మర్‌లో ఎలాంటి వ్యాయామం చేయాలి ?

* వేసవిలో స్విమ్మింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది.

* బీచ్ వాలీబాల్, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడాలి.

* మెట్లు ఎక్కడం, దిగడం చేయాలి. ఈ వ్యాయామం పొట్ట కింది భాగంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

* వేగంగా నడుస్తూ ఊపిరి లోపలి దాకా తీసుకుని వదులుతుండాలి.

* పుషప్స్ చేయాలి.

3. వేసవిలో కోడి గుడ్లు తినడం మంచిదేనా ?

చాలా మంది ఎండాకాలంలో కోడి గుడ్లు తినేందుకు కాస్త వెనక్కి జంకుతుంటారు. దీనికి కారణం గుడ్లు వేడి కలిగిస్తాయని.. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనే సందేహం. గుడ్లు వేడిని ఉత్పత్తి చేసే గుణం కలిగి ఉన్న మాట వాస్తవమే అయినా.. వేసవిలో వీటిని మితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమ్మర్‌లో అయినా సరే రోజుకు 2 గుడ్లు వరకు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని సూచిస్తున్నారు.

4. ఇవి చేయండి :

☛ సమయానికి ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి.

☛ గ్లాసులో గోరువెచ్చని నీరు తీసుకొని చెంచా నిమ్మరసం, చెంచా అల్లం రసం, 2 చెంచాల తేనె కలిపి తాగితే నీరసం నుంచి ఉపశమనం ఉంటుంది.

☛ ఒక గ్లాసు పల్చని మజ్జిగలో చెంచా పుదీనా రసం, చెంచా నిమ్మరసం కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి తాగితే కళ్లు తిరగడం తగ్గి, శక్తి వస్తుంది.

☛ గ్లాసు నల్లద్రాక్ష రసం తాగితే నీరసం తగ్గుతుంది.

5. సమ్మర్‌లో సగ్గు బియ్యంతో ఎన్ని లాభాలో...

* సగ్గుబియ్యం తీసుకుంటే బరువు పెరిగే అవకాశం తక్కువ.

* రక్తపోటు సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది.

* అజీర్తి సమస్యలు తీర్చడంలో ముందుంటుంది.

* సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ ఉండటం వల్ల పిల్లలకు మంచిది.

* ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది.

* గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి.

* విరేచనాలు త్వరగా తగ్గడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

11. మామిడి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు :

☞ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి

☞ దీనిలోని పొటాషియం, మెగ్నీషియం బీపీ సమస్యను నివారిస్తాయి

☞ ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి

☞ రక్తహీనత సమస్య తగ్గుతుంది

☞ దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి

☞ చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి


Post a Comment

0 Comments