GET MORE DETAILS

జూన్ 21 ఒక్కరోజే “సిక్స్ స్పెషల్ డేస్"

 జూన్ 21 ఒక్కరోజే “సిక్స్ స్పెషల్ డేస్"

  


జూన్ 21 ఒక్కరోజే ఆరు  ప్రత్యేక రోజులకు వేదిక కానుంది. ఏ దినోత్సవాలు ఎందుకు జరుగుతాయో తెలుసుకుందాం...

1) ప్రపంచ యోగా దినోత్సవం:  2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన తరువాత ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవాలని ఐరాస నిర్ణయించింది. ఏడాది మొత్తం మీద పగటి పూట ఎక్కువగా ఉండే జూన్ 20,21,22 తేదీల్లో మాత్రమే. ఈ మూడు రోజుల మధ్య రోజైనా జూన్ 21 ను యోగ డే గా మోడీ ఎంపిక చేశారు.


2) ప్రపంచ మానవత్వ దినోత్సవం:  ప్రజల్లో మానవత్వాలను పెంచేలా 1980 నుంచి మానవత్వ దినోత్సవం జరుగుతోంది. ఎన్నో దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవత్వం పెంపొందించటానికి కృషి చేసేందుకు స్పూర్తినిచ్చే రోజు.


3) జలదినోత్సవం (హైడ్రోగ్రఫీ డే):  జల వనరుల అభివృద్ధికి ప్రజలను కట్టుబడివుండేలా చేసేందుకు హైడ్రోగ్రఫీ డే, 2005 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. ఐరాస కూడా దీన్ని గుర్తించింది. హైడ్రో గ్రఫీ అంటే జన వనరుల భౌతిక స్వరూపాల కొలామానాల విజ్ఞానశాస్త్రం. నదులు చిత్రాలు సరస్సులు ఇతర జలాశయాలను అన్ని రంగాల అభివృద్ధికి హైడ్రో గ్రఫీ తోడ్పడుతుంది.


4)  సంగీత దినోత్సవం: ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 1982లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్, అదే దేశానికి చెందిన సంగీత కళాకారుడు ఫ్లూ హెమోవిస్ మ్యూజిక్ డేను ప్రారంభించారు. ఈ రోజున బహిరంగ ప్రదేశాల్లో తమ తమ వాయిద్య పరికరాలతో సంగీతాన్ని వినిపిస్తుంటారు సంగీత కళాకారులు.


5) హ్యాండ్ షేక్ డే: షేక్ హ్యాండ్ డే అంటే కరచాలన దినోత్సవం. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ ఏడాది కరచాలన దినోత్సవం జరిగేలా లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం ముఖ్యం కదా. 


6) టీ షర్ట్ డే:  టీ షర్ట్ డే వల్ల సమాజానికి ఎటువంటి శ్రేయస్సు లేకపోయినా.. 2008లో ఓ జర్మనీ దుస్తుల సంస్థ దీన్ని ప్రారంభించింది. యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డే ని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీ లేదు.

Post a Comment

0 Comments