GET MORE DETAILS

విద్యార్థుల్లో లోపించిన క్రమశిక్షణ, పర్యవేక్షణ ! పరిస్థితులు ఇలా..!

విద్యార్థుల్లో లోపించిన క్రమశిక్షణ, పర్యవేక్షణ ! పరిస్థితులు ఇలా..!



విద్యార్థులు, యువత పెడదారి పడుతున్నారు... క్రమశిక్షణతో సాగాల్సిన చదువులు పక్కదారి పట్టి చెడువ్యసనాలకు లోనై వక్రమార్గాలలో నడుస్తున్నారు. ఈ చర్యల వల్ల విద్యార్థులలో నైతిక విలువలు పతనమవుతున్నాయి. ఒకప్పుడు విద్యాబుద్దులు బోధించిన గురువు కనిపిస్తే గౌరవంగా మెలిగే విద్యార్థులు ఇప్పుడు గురువులను గేలి చేసే దశ దాటి ఏకంగా దాడి కూడా చేస్తున్నారు. అంతేకాదు సమూహాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల అద్దంకిలో చోటుచేసుకున్న పలు సంఘటనలు అందర్నీ విస్మయానికి గురిచేసింది. రెండు కళాశాలలకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇది మరువకముందే ఓ ప్రైవేట్‌ కళాశాల ప్రిన్సిపల్‌పై మరో కళాశాల విద్యార్థులు దాడి చేయటంతో గాయాలయ్యాయి. గతంలో ఆర్టీసీ బస్టాండ్‌లో పలుసార్లు ఈవ్‌టీజింగ్‌ విషయంలో విద్యార్థులు దాడు లు చేసుకున్నారు. ఇక ఆయా కళాశాలలలో బయటకు రాకుండా పలు సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు స మాచారం. ఇక యువత బైక్‌రైడింగ్‌లు పరిశీలిస్తే ప్రజలు, వాహనచోదకులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ఇటీవల బైక్‌తో ఓ యువకుడు చేసిన విన్యాసాలు స్థానికులను భయపెట్టాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్జి సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించటంతో కేసు నమోదు చేశారు. వారం క్రితం ఓ యువకుడు మోటార్‌ సైకిల్‌తో విన్యాసాలు చేస్తూ ఢీకొనడంతో వేరే మోటార్‌సైకిళ్లపై వెళ్తున్న ఉపాధ్యాయుడు, హెడ్‌ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారి ని వెంబడించిన ఉపాధ్యాయుడు చివరకు పట్టుకొని ప్రశ్నించగా లెక్కలేని విధంగా సమాధానం చెప్పాడు. తీరా ఆ మోటార్‌ సైకిల్‌కు కనీసం నెంబర్‌ కూడా లేకపోవటం గమనార్హం. ఇలా తరచూ పలు సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటన్నింటికి మూలం విద్యార్థులలో  క్రమశిక్షణ, పర్యవేక్షణ లోపించటమేనని తెలుస్తుంది. 

పట్టించుకోకపోవడం వల్లే...

పాఠశాల స్థాయి వరకు క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులు ఇంటర్‌లోకి వచ్చే సరికి స్వేచ్ఛాజీవులుగా మారి రెచ్చిపోతున్నారు. ప్రధానంగా విద్యార్థులపై అటు తల్లిదండ్రులు, ఇటు కళాశాలల అధ్యాపకులు, యాజమాన్యాల పర్యవేక్షణ కొరవడటంతో పక్కదారి పడుతున్నారు. పిల్లలను కళాశాలలలో చేర్చటం, ఫీజులు చెల్లించటంతో తమ పని పూర్తయినట్లు తల్లిదండ్రులు భావించటం, ఇక కళాశాల ల యాజమాన్యాలు తమకు రావాల్సిన ఫీజులు వచ్చాయి కాబట్టి బోధన వరకే పరిమతం కావటంతో విద్యార్థులలో క్రమశిక్షణ కొరవడుతుంది. దీంతో వారిలో నైతిక విలువలు మచ్చుక కూడా కనిపించటం లేదు. 

ఇటీవల అద్దంకిలో చైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థినుల పట్ల వేరే కళాశాల విద్యార్థులు అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ప్రశ్నించిన ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావుపై విద్యార్థులు కర్రతో దాడి చేశారు. ఒకప్పుడు చిన్న తప్పు చేస్తే వెంటనే  కళాశాల  నుంచి ఆ విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటం, పోలీసులు సైతం ఫిర్యాదులు వచ్చిన సమయంలో హడావుడి చేయటం మినహా ఈవ్‌టీజింగ్‌ జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయకపోవటంతో మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ఉ పాధ్యాయులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు.. వి ద్యార్థుల కదలికలు, నడవడికలపై ప్రత్యేక నిఘా పెట్టాల ని పలువురు కోరుతున్నారు. అంతేగాక వారిలో క్రమశిక్షణ పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments