GET MORE DETAILS

కామరూపిణి కల్పవల్లి - కామాఖ్యాదేవి

కామరూపిణి కల్పవల్లి - కామాఖ్యాదేవి



మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే, తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవటం. ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి.

పురాణ గాథ :

సతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఆమె భర్త పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన కూతురిని అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ గుండంలో దూకి అగ్నికి ఆహుతైపోతుంది. ఆగ్రహోద గ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్త వ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటంవల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీమహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూలకారణ మైనస్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఆలయ పురాణం :

కూచ్ బెహర్ రాజవంశానికి చెందిన చిలరాయ్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతకుముందే అక్కడ ఉన్న ఆలయాన్ని కాలపహార్ అనే అజాత వ్యక్తి నాశనం చేయటంతో చిలయ్ రాయ్ పునర్నిర్మించారు. తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదానికి ప్రవాన్ని కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లోకి కూడా

ప్రవేశించరు. ఈ ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉం టుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు, మండ పాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్పకళాఖండా లతో, తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక భావన లకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలి స్తారు. ఈ ఆలయంలో అమ్మ వారిని దర్శించుకున్న అనంత రం ప్రదక్షిణ చేయకపోతే దర్శనఫలం దక్కదని భక్తుల నమ్మ కం. సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించు కోక వాడదనే నియమం కూడా ఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు.

ఉత్సవాలు :

ఏటా వేసవిలో మూడు రోజుల పాటు అంబుబాచీ పండు గ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహి స్తారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారు లు కూడా గుడి లోపలికి వెళ్లరు. నాలుగో రోజు లక్షలమంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపు రంగులో ఉంటుం ది. నవరాత్రి సమయంలో ఐదు రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపదమాసంలో మానస పూజ నిర్వ హిస్తారు. ఆ సమయంలో జంతుబలులు నిషేధం.

చేరుకునే మార్గాలు :

దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి విమాన సదుపాయం ఉంది. విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కామాఖ్యదేవి ఆలయం ఉంది. గౌహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కి.మీ దూరంలో ఉంది.

గౌహతి లో ఎక్కడినుంచైనా ట్యాక్సీ, ఆటోరిక్షా ద్వారా ఆల యానికి చేరుకోవచ్చు. అసోం పర్యా టక విభాగం ప్రత్యేక బస్సు లు నడుపుతోంది.


ఓం నమో నారాయణాయ.

Post a Comment

0 Comments