GET MORE DETAILS

కాకిగోల అని తీసిపారేస్తాం కానీ కాకులు ఎంత తెలివైనవో తెలుసా...?

కాకిగోల అని తీసిపారేస్తాం కానీ కాకులు ఎంత తెలివైనవో తెలుసా...?



1) కాకులు చాలా తెలివైన పక్షులు. రామ చిలుకలు తప్ప మిగతా అన్ని పక్షుల కంటే పెద్ద మెదడును కలిగి ఉంటాయి.

2) కాకులు మామూలు సాధనాలను పనులకు ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, జపాన్లో కొన్ని కాకులు గింజలను పగులగొట్టడానికి రోడ్డు మీద పోతున్న కార్లను వాడడం కనిపించింది. కొన్ని సందర్భాల్లో, పాత్రల్లో ఆహారం అందకపోతే కర్రలను ఉపయోగించి కూడా అందుకోవడం చూశారు.

3) కాకులు అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి ఉంటాయి. సేకరించిన ఆహారాన్ని దాచుకోవడం వాటికి అలవాటు. కొన్నిసార్లు ఆహారాన్ని 2-3 వివిధ చోట్లకు మార్చడం అలవాటు, కానీ ఆ ప్రదేశాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాయి.

4) కొన్ని రకాల పక్షులు తమ జాతికి చెందిన పక్షి చనిపోతే పట్టించుకోవు. కానీ, కాకులు పడిపోయిన స్నేహితుడి చుట్టూ గుమికూడి, ఇతర కాకులను పిలుస్తాయి.

5) కాకులు చాలా ధైర్యం గలవి. తమ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ సైజు గల గ్రద్దల తరుముతాయి. అంత ధైర్యం ఉన్నప్పటికీ, కాకులు తరచూ ప్రజల నుండి జాగ్రత్తగా ఉంటాయి, మనుషుల నుంచే కాకులకు ప్రమాదం.

6) యూరప్ మరియు ఆసియా ప్రాంతాలలో కాకులు ఎక్కువగా కనపడుతాయి. వీటి జనాభా 43 నుంచి 204 మిలియన్ల మధ్య అంచనా వేయబడింది.

7) కాకులు పగబడతాయి కూడా. వాటికి చెడు చేసిన వారిని కొన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుంటాయి. గుంపులుగా వచ్చి దాడి చేస్తాయి.

8) వీటికి ఒక వింత అలవాటు ఉంది. చీమలను తమ ఈకల నిండా పాకించుకుంటాయి. దీని కోసం కొన్నిసార్లు చీమల పుట్ట సమీపంలో ఉంటాయి. ఈ విధంగా ఎందుకు చేస్తాయో ఇప్పటివరకు అంచనా వేయలేక పోయారు.

9) ఆడ, మగ కాకులు ఒకసారి జతకలిస్తే జీవితాంతం కలిసి ఉంటాయి, మరణంతో మాత్రమే వేరుపడుతాయి. కొన్ని సందర్భాల్లో మగ కాకులు భాగస్వామిని విడిచి వెళ్లడం గుర్తించారు, కానీ ఆడ కాకులు మాత్రం ఎప్పటికీ విడిచి వెళ్లవు.

10) కాకి దాదాపు 1000 రకాల ఆహారాన్ని సేకరించి తింటుంది. ఇందులో పురుగులు, కీటకాలు, పండ్లు మరియు విత్తనాలు మొదలైనవి ఉంటాయి.

11) కాకులు మంచి గుడ్డు దొంగలు కూడా. ఇతర పక్షులు గూడు కట్టుకోవడం, అవి ఏ టైం కు గూళ్లో ఉంటాయి అనే విషయాలను నిశితంగా గమనిస్తాయి.

Post a Comment

0 Comments