GET MORE DETAILS

అగ్నిపథ్‌పై దుష్ప్రచారం ద్వారా అశాంతిని రేపుతున్న శక్తుల కుట్రలను తిప్పికొడదాం.

 అగ్నిపథ్‌పై దుష్ప్రచారం ద్వారా అశాంతిని రేపుతున్న శక్తుల కుట్రలను తిప్పికొడదాం.



 ఈ తరహా ప్రచారం కారణంగా  ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు గురై నిరసనలు చేస్తున్నారు. కేవలం నాలుగేళ్లు సర్వీస్‌లో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమిటని వారి ఆందోళన. ఇలాంటి అపోహలను తొలగిస్తూ, వాస్తవాలను దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెబుదాం.

అగ్నిపథ్‌ పథకం ఎందుకు ?

దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడంతో పాటు యువతకు, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా సంస్కరణలకు అంకురార్పణ పలికిన కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్‌' పేరుతో కొత్త సర్వీసులను ప్రారంభించింది.   కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో అత్యధికం వేతనాలు, ఫించన్లకే పోతోంది. ఈ భారాన్ని తగ్గించడం ద్వారా మిగులు నిధులను రక్షణ రంగ ఆధునీకరణకు కేటాయించడం అగ్నిపథ్లో ఒక భాగం మాత్రమే..

అగ్నివీర్‌ల ఎంపిక ఎలా చేస్తారు ?

అగ్రిపథ్‌ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారిని 'అగ్నివీర్‌’లు అంటారు. అగ్నిపథ్‌ సర్వీసులో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు.  వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్‌ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్‌ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.

అగ్నివీర్‌ల సేవా కాలం ఎంత ?

అగ్నివీర్‌ల సేవా కాలం మొత్తం నాలుగేళ్లు.. ఆరు నెలలు శిక్షణ తర్వాత మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. మొత్తం నాలుగేళ్ల సర్వీసు కాలంలో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి. నాలుగేళ్ల సర్వీసు అనంతరం సైన్యం అగ్నివీర్‌లకు ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల నిధి(పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణసదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.

సైన్యంలో భవిష్యత్‌ అవకాశాలు ఎలా ?

అగ్నిపథ్‌ సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశాలను మరింత సులభం చేస్తుంది.. ఈ పథకం నాలుగేళ్ల కాంట్రాక్టుదే అయినా అగ్నివీర్‌ల మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుంది. సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్నీ ఇస్తారు.  దీని ద్వారా పలు రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి..

ఇతర అగ్నివీర్‌ల భవిష్యత్తు ఏమిటి ?

అగ్నిపథ్‌లో నాలుగేళ్ల సర్వీసు అనంతరం 'అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌'తో పాటు తదుపరి ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. సీఏపీఎఫ్(CAPF), రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది.  స్వయం ఉపాధి కోసం కేంద్రం ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. మొత్తం మీద అగ్నివీర్‌ల భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది. వీరి భవిష్యత్తు అగమ్యగోచరం అనే వాదనలో వాస్తవం లేదు

సైన్యంలో అవకాశాలు తగ్గుతాయా ?

అగ్నిపథ్‌ ద్వారా నాలుగేళ్లపాటు దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్నేళ్లలో సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్ల కంటే అగ్నివీరుల రిక్రూట్‌మెంట్లు మూడు రెట్లు పెరుగుతాయి. అగ్నిపథ్ కారణంగా వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు. నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత సెలెక్ట్ అవుతారు. తద్వారా సాయుధ బలగాల బృందం సమన్వయాన్ని మరింత పెంచినట్లు అవుతుంది

సాయుధ బలగాల సామర్థ్యం క్షీణిస్తుందా ?

సైన్యంలో అగ్నిపథ్‌ తరహా స్వల్పకాలిక నియామక విధానం ప్రపంచంలో పలు దేశాలలో ఉంది. శక్తివంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమం.. . మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. అందువల్ల ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్‌ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల సైన్యాలు  యువతపైనే ఆధారపడుతున్నాయి.  ఎక్స్‌పీరియన్స్‌ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు ఉండరు.  సుదీర్ఘ కాలంలో యువకులు, నైపుణ్య పర్యవేక్షక అధికారులు 50%-50% ఉండేలా చేస్తుంది.

అగ్నివీర్‌లు ప్రమాదకరులవుతారా ?

అగ్నివీరులు సర్వీసు పూర్తయ్యాక సమాజంలోని వస్తే ప్రమాదకరులవుతారని, ఉగ్రవాదులతో చేతులు కలుపుతారనే ప్రచారం జరుగుతోంది.. ఈ వాదనలు చాలా పెద్ద  అపోహ మాత్రమే.. ఇలాంటి వ్యాఖ్యలు భారత సైన్యాన్ని అవమానించడమే అవుతుంది.  నాలుగేళ్లుగా యూనిఫాం ధరించి భారత మాతకు సేవలందించిన యువకులు జీవితాంతం దేశం కోసమే పని చేస్తారు కానీ దేశానికి ద్రోహం చేయరు. ప్రస్తుతం ప్రతి ఏటా వేలాది సైనికులు పదవీ విరమణ పొందుతున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ దేశ వ్యతిరేక దళాలలో చేరిన దాఖలాలు లేవు.

రక్షణ రంగ నిపుణులను సంప్రదించలేదా ?

సాయుధ దళాల మాజీ అధికారులను, రక్షణరంగ నిపుణులను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తీసుకోకుండా అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించారనే ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు.. ఎంతో మందితోయ కేంద్రం గత రెండేళ్లుగా సంప్రదింపులు జరిపింది. మిలిటరీ అధికారులతో కూడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఈ ప్రతిపాదనను రూపొందించారు. నిజానికి దాదాపు అందరూ మాజీ అధికారులందరూ అగ్నిపథ్ పథకం ప్రయోజనాలను గుర్తించి దానిని సంతోషంగా స్వాగతించారు.

మన యువత జీవిత ఆరంభంలో నాలుగేళ్లపాటు దేశ రక్షణ కోసం పని చేసి మంచి ప్యాకేజీతో సైన్యం నించి బయటకు వచ్చి, భావి జీవితాన్ని ఇతర ప్రభుత్వ ఉద్యోగం లేదా ఇంకేదైనా నచ్చిన వృత్తి, వ్యాపారం కొనసాగించేందుకు చక్కని అవకాశం కల్పిస్తోంది అగ్నిపథ్‌.. కొందరు స్వార్ధ నాయకులు, విద్రోహులు ప్రధాని మోదీపై ద్వేషం పెంచేందుకు ఈ పథకంపై అపోహలు సృష్టించి, అల్లర్లు రేకెత్తించడం దారుణం.. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది.

భారత్‌ మాతాకీ జై..



Post a Comment

0 Comments