అసలు అగ్నిపధ్ వల్ల ఉపయోగం ఏంటో చూద్దాం...?
ఇజ్రాయిల్ లాంటి దేశాలలో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి సైన్యం లో మూడు నాలుగు ఏళ్ళు పని చెయ్యాలి.... అలా ఉండటం మూలం గానే ఇజ్రాయిల్ లాంటి దేశాలలో 100 శాతం దేశ భక్తులు ఉంటారు... ఇజ్రాయిల్ చుట్టూ మొత్తం ముస్లిం దేశాలు ఉన్నా కూడా ఇజ్రాయిల్ వైపు కన్ను ఎత్తి కూడా చూడలేవు...... ఎందుకంటే ఆ దేశంలో ప్రతి వ్యక్తి సైన్యంలో పని చేసి బయటకు రావడం మూలంగా అందరూ దేశం కోసమే పని చేస్తారు.
ఇప్పుడు మన దేశంలో ప్రవేశ పెట్టిన అగ్నిపధ్ కూడా అటువంటిదే... 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల యువకులకు సైన్యంలో తీసుకొని ఎంపిక అయిన వారికి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెల కు 30,000 రు.ల నుండి 40,000 రూపాయల జీతం ఇచ్చి 4 ఏళ్ల తరువాత వారిలో సామర్ధ్యం ప్రతిభని బట్టి 25 శాతం మందిని వారు మళ్ళీ అప్లై చేస్తే శాశ్వతంగా సైన్యంలోకి తీసుకుంటారు... 4 ఏళ్లు నిండిన వారికి 12 లక్షల రూపాయలు+ సర్టిఫికేట్ ఇచ్చి గౌరవంగా పంపిస్తారు.
దీనిలో కేంద్రం ఉద్దేశం ఏంటి అంటే... 18 ఏళ్ల నుండి 21 ఏళ్లలో ఖాళీగా ఉండే యువత చెడుదారులకు వెళ్లకుండా సైన్యంలో చేరితే మంచివాడుగా ఉంటాడు..దేశ భక్తుడు అవుతాడు... 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల మధ్యలో మంచిగా సంపాదనపరుడు అవుతాడు. బాధ్యతగల పౌరుడు అవుతాడు అనే మంచి ఉద్దేశంతో ఈ పథకం పెట్టారు...జాబ్ లు రాక 30 ఏళ్ల వరకు వేచి చూసే కంటే ఈ పథకం బాగానే ఉంది కదా... అలాగే 4 ఏళ్లు పూర్తిగా సైన్యంలో పనిచేసిన వారినీ అన్ని ప్రవైట్ కంపెనీలు తీసుకుంటాయి.... లేదా ప్రభుత్వం ఇచ్చే 12 లక్షలతో ఏదైన వ్యాపారం చేసుకోవచ్చు.... ప్రతిపక్షాల భయం ఎంటి అంటే యువత ఇలా సైన్యం లో జాయిన్ అయితే వారికి ఎవ్వరూ ఓటు వెయ్యరు... వారు ఇచ్చే బీర్, బిర్యానీలకి డబ్బులకు సైన్యంలో పని చేసిన వచ్చిన వాడు ఎవ్వరూ ఆశపడి ఓటు వేయరు. ...అయినా బస్ లు రైల్ లు తగల బెట్టే వారు.. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టే వారు సైన్యంలోకి ఎలా వెళ్తారు.. దేశభక్తుడు ఎలా అవుతాడు.....?
ఆలోచించండి... మన దేశం కోసం...
ఆలోచించండి... మన యువత కోసం.
0 Comments