GET MORE DETAILS

శివుడు స్మశాన వాసి ఎందుకు అయ్యాడు ?

 శివుడు స్మశాన వాసి ఎందుకు అయ్యాడు ?త్రిమూర్తులు లో ఒక్కడైనా పరమశివుడు కైలాసం లో, కాశీ లో వశిస్తుంటాడు. అయితే ఈయన స్మశానం లో కూడా వశిస్థాడని చెపుతారు. అంతటి మహిమన్వితునికి స్మశానం లో ఉండవలసిన అగత్యం ఏమిటి?ఈ ప్రశ్నలకు మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో సమాధానం దొరుకుతుంది.

ఒక సారి కైలాసం లో పార్వతీపరమేశ్వరులు ఇరువురు మాట్లాడు కుంటుండగా, పార్వతీదేవి పరమేశ్వరుని, స్వామి మీరు స్మశానం లో ఎందుకు నివసిస్తారు? అని ఆడిగినది. దానికి సమాధానం గా శివుడు.

దేవి ఒకమారు బ్రహ్మదేముడు నన్ను కలిసి మహేశ్వర స్మశానం లో ఉగ్రభూతాలు జనావాసాల మీద పడి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. అనిచెప్పాగా నేను వాటిని నియంత్రి0చడానికి స్మశాన వాసినయ్యాను. అంతే కాకుండా మరణించిన వ్యక్తి ని దహనం చేసి బంధువులు వెనుతిరిగిన తరువాత ఆ జీవుడు ఒంటరిగా ఏడుస్తుంటే నేను అతనిని ఓదార్చి స్వాంతన చేకూరుస్తాను. అంతే తప్ప మరొక కారణం లేదు అని చెప్తాడు.

 ఈ చిన్ని కధ వల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే. మనిషి జీవన పర్యంతం భగవత్ స్పృహ లేకుండా, సంసార బంధం అనే చట్రం లో ఇరుక్కొని, లోక వ్యవహారం లో ఇబ్బడి ముబ్బడిగా కూరుకు పోయి అంత్యకాలం లో భార్యాపిల్లలు బంధువులచే వదిలివేయ బడి ఆ జీవుడు ఏకాకి అయి విలపిస్తుండగా, అప్పుడు ఆ ఆసుతోషుడు అక్కున చేర్చుకుని స్వాంతన చేకూరుస్తాడు. 

అందుకే దూర్జటి తన కాళహస్తీశ్వర శతకం లో ఇలా అంటాడు...

దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే

కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే

వింతల్మేన చరించునప్పుడె కురుల్వెల్వెల్లగానప్పుడే

చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!

పరమశివా ఈ శరీరం లో సకల శక్తులు ఉన్నప్పుడే ధనసంపాదన ఎలా చేస్తామో అలాగే భగవంతుని పైన కూడా చిత్తము ఉంచి పర్యంతం దేవుని సేవలో తరించాలి.!

హర హర మహాదేవ

Post a Comment

0 Comments