మైలు రాయిలకు వివిధ రంగులు ఎందుకు ఉంటాయి...?
సాధారణంగా దారివెంట ప్రయాణం చేస్తున్నప్పుడు మైలురాళ్ళకు వివిధరంగులు ఎందుకు ఉంటాయో కిలోమీటర్ల దూరాన్ని తెలిపై మైలురాళ్లను చూసి ఉంటారు. దానిపై ఊరి పేరు, వచ్చే గ్రామం ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో చెబుతుంది.
ఇందులో ఇంకో విషయం ఏంటంటే మైలురాళ్లు వివిధ రకాల రంగుల్లో ఏర్పాటు చేసి ఉంటాయి. మరి ఇలా మైలు రాయిలకు వివిధ రంగులు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైన గమనించారా..? గమనించి ఉండరు. అందుకే వాటి గురించి మీకు చెప్పబోతున్నాము.
ఈ రంగులను బట్టి అర్థాలు ఉంటాయి :
మైలురాయి రంగులు రెండు రంగుల్లో ఉంటాయి. సగానికి పైగా తెలుపురంగు ఉంటే, పైన ఉండే రంగు మాత్రం వేరే రంగులో ఉంటుంది. తెలుపురంగు అనేది అన్ని మైలురాళ్ళకి ఒకటిగా ఉండటం అనేది అందరికి తెలిసిందే. కానీ తెలుపు రంగుకు కలయిక వచ్చే రంగు మాత్రమే మారుతుందని గమనించాలి. తెలుపుతో పాటు వేరే రంగు ఉండే ఇతర భాగం అర్థాలు వేరేగా ఉంటాయి.
మీరు ఉన్న ప్రదేశంలో మైలురాయి పసుపురంగులో ఉన్నట్లయితే మీరు జాతీయరహదారి మీద ఉన్నారని అర్థం. అదే పచ్చరాయి ఉంటే మీరు రాష్ట్రరహదారి మీద ఉన్నారని గుర్తించుకోవాలి.
ఒకవేళ మైలు రాయి నలుపు నీలం లేదా తెలుపులలో ఉన్నట్లయితే మీరు సిటీ లేదా జిల్లాలోకి ప్రవేశించారని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ దారులను కేవలం ఆ నగరము పర్యవేక్షిస్తుందని గర్తించుకోవాలి. ఒకవేళ మైలురాయి ఎరుపు రంగులో ఉంటే మీరు గ్రామీణప్రాంతం గుండా ప్రయాణిస్తున్నారని అర్థం. ఈ దారులు ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కిందకు వస్తుంది. ఇవి రహదారుల వెంట ఉండే మైలు రాయి రంగుల అర్థం.
0 Comments