GET MORE DETAILS

నిమిషాల్లో డిజిటల్ పొదుపు ఖాతా

 నిమిషాల్లో డిజిటల్ పొదుపు ఖాతా


దేశంలో బ్యాంకింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు చిన్న పనికోసం బ్యాంకు శాణుకు వెళ్లి, దరఖాస్తులు నింపి, గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. యూపీఐ రాకతో రోజువారీ చెల్లింపుల ముఖచిత్రం మారింది. ఈ మార్పు కేవలం చెల్లింపులకే పరిమితం కాలేదు. పొదుపు ఖాతాలను నిర్వహించే విధానం లోనూ ఖాతాదారులు డిజిటల్ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ సేవింగ్స్ ఖాతాలు ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల కలిగే లాభాలేంటి? భద్రత ఎంత? అనే విషయాలను పరిశీలిద్దాం.

• పేరులో ఉన్నట్టుగానే, ఇది పూర్తిగా ఆన్ లైన్ పొదుపు ఖాతా. దీన్ని ప్రారంభించేం దుకు, నిర్వహించేందుకు మీరు బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. భౌతికంగా పత్రాలను నింపడం, వేచి చూడటం వంటి ఇబ్బందులు ఇందులో ఉండవు. చాలా సందర్భాల్లో, ఆధార్ ఆధా రిత ధ్రువీకరణ లేదా వీడియో కేవైసీని ఉపయోగించి కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన వెంటనే లావాదేవీలూ ప్రారంభించవచ్చు.

• ఆన్లైన్ ఖాతా అనగానే చాలామందికి భద్రతపై అను మానాలుంటాయి. డిజిటల్ ఖాతాలూ ఆర్బీఐ పరిధి లోకి వచ్చే సాధారణ పొదుపు ఖాతాలే, సంప్రదాయ బ్యాంకు ఖాతాలకు ఉన్నట్లే ఈ ఖాతాల్లోని డబ్బుకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. కాబట్టి, గుర్తింపు పొందిన బ్యాంకులో డిజిటల్ ఖాతా తెరిస్తే, మీ డబ్బు సురక్షి తంగానే ఉంటుంది.

• అవసరమైన పత్రాలు సంబందిత బ్యాంకు యాప్లో అప్లోడ్ చేసి, వీడియో కేవైసీని పూర్తి చేస్తే చాలు.. ఖాతా సంఖ్య, ఇతర వివరాలు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తక్షణమే అందుతాయి.

• భౌతిక డెబిట్ కార్డు కావాలంటే కొరి యర్ ద్వారా ఇంటికి వస్తుంది. చాలా బ్యాంకులు ఆన్లైన్ షాపింగ్ కోసం వెంటనే వాడుకునేలా వర్చువల్ డెబిట్ కార్డును తక్షణమే జారీ చేస్తాయి.

• కొన్ని డిజిటల్ ఖాతాలను సంప్రదాయ బ్యాంకులు నేరుగా అంది స్తుండగా, మరికొన్ని ఫిన్స్టక్ సంస్థల భాగస్వామ్యంతో అందుబాటులోకి తెస్తున్నాయి.

• కేవలం 10-20 నిమిషాల్లోనే ఈ ఖాతాను సులభంగా ప్రారంభిం చేందుకు వీలుంది. విద్యార్థులు, గిగ్ వర్కర్లు, మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి ఇవి చాలా అనుకూలం. చాలా డిజిటల్ ఖాతాలను సున్నా నిల్వతోనే ప్రారంభించేందుకు. వీలుంది.

• కొన్ని డిజిటల్ ఖాతాలు.. డెబిట్ కార్డు ఫీజులు, ఇతర ఛార్జీలూ వసూలు చేయవు. యూపీఐ, బిల్లు చెల్లింపులు, కార్డుతో చేసిన ఖర్చులకు రివార్డు పాయింట్లూ ఇస్తాయి.

ఇవీ చూడండి...

▪️సున్నా నిల్వ డిజిటల్ ఖాతాను ఎంచు కుంటే, ఉచిత ఏటీఎం ఉపసంహరణలపై పరిమితులు ఉండొచ్చు. పూర్తి కేవైసీ పూర్తి చేసే వరకూ కొన్ని సేవలపై ఆంక్షలు ఉంటాయి.

▪️రోజువారీ ఖర్చుల కోసం వాడుకునేందుకు ఈ డిజిటల్ ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మీ ప్రధాన బ్యాంకు ఖాతాలో చిన్న చిన్న చెల్లింపుల వివరాలు కనిపించకుండా ఉంటాయి.

▪️బ్యాంకు పనులన్నీ ఫోన్ ద్వారానే నిర్వహిస్తారు. కాబట్టి, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బలమైన పాస్వర్డ్లు, డివైజ్ సెక్యూరి టీలు, రెండంచెల ధ్రువీకరణ (టూ-ఫ్యాక్టర్-అథెంటికేషన్) తప్పనిసరిగా వాడాలి.

Post a Comment

0 Comments