బెజవాడలో పానీపూరీ వల్ల టైఫాయిడ్ పాజిటవ్ కేసులు : పానీ పూరీ అమ్మేవాళ్ళ చేతి వాడకం వల్ల టైఫాయిడ్ విజృంభణ.
పానీ పూరీ అంటే ఇష్టపడని జనాలు ఉంటారా చెప్పండి. ఎంత పెద్ద డబ్బున వ్యక్తి అయిన సరే..రోడ్డు పక్కన కార్ ఆపి మరీ పానీ పూరీ తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టం గా తినే ఈ పానీ పూరీ ఇప్పుడు కొత్త సమస్యలను తీసుకువస్తుంది. గత కొద్ది రోజుల నుండి విజయవాడలో జ్వరాలు, జలుబు, దగ్గు అంటూ హాస్పిటల్ కి క్యూ కడుతున్న వారీ సంఖ్య ఎక్కువగా ఉంది.
చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఇలాంటి లక్షణాలతో హాస్పిటిల్ కి వెళ్తున్నారు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా జ్వరం తగ్గట్లేదని..నీరసం గా ఉంటుందని..రోగులు చెప్పుకొస్తున్నారట. టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని తేలింది. కాగా, రోజు రోజుకు ఇలాంటి రోగుల సంఖ్య ఎక్కువ అయిపోతున్నారు. ఈ క్రమంలో నే ఎక్కువుగా RMP వైద్యుల దగ్గర టైఫాయిడ్ కేసులు అధికమయ్యాయి.ముక్యంగా ఏలూరు రోడ్డులో, బందరు రోడ్డు, మొగల్రాజపురంలో కేసులు అధికంగా ఉన్నాయని RMP వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీరు ఉంటే కచ్చితంగా టైఫాయిడ్ భారిన పడతారని పానీపూరీ అమ్మేవాళ్ళు అదే చేతిని ముంచటం వల్ల బ్యాక్టీరియా విజృంభిస్తుందని వెల్లడిస్తున్నారు.
ఇలా “టైఫాయిడ్” కి గురైన వారిలో ఎక్కువుగా పానీ పూరీ తినే వారు ఉన్నారని, జ్వరం అంటూ బాధపడే వాళ్లల్లో ఎక్కువ మంది పానీ పూరీ తిన్నాకనే ఇలా సిక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు నగరవాసులు పానీ పూరీ అంటేనే భయపడుతున్నారు. బయట పడుతున్న వర్షానికి..దోమలు ఎక్కువ అవ్వడం..వాతావరణంలో మార్పులు..అంటూ ప్రజలు ఇబ్బంది పడుతుంటే..ఇప్పుడు కొత్తగా ఈ టైఫాయిడ్ నగరవాసులను మరింత భయపెడుతుంది.
0 Comments