ఆషాఢ మాస వైభవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సూర్యుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచే దక్షిణాయానం ప్రారంభమవుతుంది.తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. మహాభారతాన్ని రచించిన వ్యాసుభగవానుడిని ఆరాధించే రోజే ఆషాఢపౌర్ణమి దీన్నే గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు.దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాఢమాసం.
ఇక ఆషాఢంలో గుర్తుకు వచ్చేది గోరింటాకు. ఆషాఢంలో గోరింటాకు కొత్తా చిగురిస్తుంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువు. దాన్ని చేతులకు పెట్టుకుంటే కొత్త ఉత్తేజం వస్తుంది.
మరి ఎందుకు దీన్ని శూన్యమాసం అంటారు ?
పెళ్లి ఎన్ని నెలలైనా వాయిదా వేస్తారు కానీ ఆషాఢంలో మాత్రం వివాహాలు చెయ్యరు. అలాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకమూ ఉంది. దీనికి కొన్ని కారణాలున్నాయి.
ఆషాఢంలో భార్యాభర్తలు కలిస్తే గర్భం వస్తుంది. ఆ సమయంలో గర్భం వస్తే వేసవిలో కాన్పు ఉంటుంది.అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడంతో ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో భార్యను దూరంగా పెడతారు.
ఆరోగ్యంపరంగా ఆషాఢం అనుకూలం కాదు. జలుబు, జ్వరంలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో భార్యాభర్తలు కలిస్తే ఆ ప్రభావం పిండంపై పడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది.
అందుకే ఒక సంప్రదాయం పేరు చెప్పి భార్యాభర్తలను వేరుగా ఉంచుతారు. ఆషాఢంలో భార్యాభర్తలిద్దరూ పూజలతో గడపమంటారు.
ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు ఇది మంచిది కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి.
పండితులంతా పూజల్లో ఉంటారు. దీంతో వాళ్లు పెళ్లి తంతు చేయడానికి సమయం ఉండదు కనుక ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు.
అలాగే ఆషాఢంలో దేవుళ్లు నిద్రలోకి వెళ్తారట. దీంతో వివాహం చేసుకుంటే వారి ఆశీస్సులు అందవట. దక్షిణ భారతంలో ఆషాఢంలో ఏ పంట చేతికిరాదు. వివాహం చేయడానికి ఈ సమయంలో డబ్బు ఉండదు. దీని వల్ల కూడా ఆషాడంలో వివాహాలు జరగవు. ఆషాఢంలో గాలి వానలు ఎక్కువ. దీంతో వివాహాలకు ఆటంకాలు వస్తాయి. అందుకే ఆషాఢంలో వివాహాలు నిర్వహించరు.
0 Comments