GET MORE DETAILS

శివుడంటే శుభములను ఇచ్చువాడని అర్థము, మరి ఈశ్వరుడంటే...?

శివుడంటే శుభములను ఇచ్చువాడని అర్థము, మరి ఈశ్వరుడంటే...?



(అ) తత్+క్షణము =తక్ష్ణము = ఆ క్షణములోనే, వెనువెంటనే ఆ సమయములోనే అని అర్థము. తక్షణము అని వ్రాయడముకంటే తక్ష్ణము అని వ్రాయడమే బాగుంటుంది.

అలాగే తీక్ష్ణము కూడా,తీక్షణమని వ్రాయడము కంటే తీక్ష్ణము అని వ్రాయడమే బాగుంటుంది.

తీక్ష్ణమంటే వాడైనది, చురుకైనది, యుద్ధము, కారము, మిరియము, మరణము, ఆయుధము, నిప్పు అనే అర్థాలున్నాయి.

(ఆ) అంత:కరణిసాక్షిగా - అంత:కరణమంటే లోపలున్న ఇంద్రియము,కంటికి కనబడని ఇంద్రియమన్నమాట , అదేమంటే మనస్సు.

(ఇ) ఉపాసన - ఎవరి పేరోమరి ? ఉపాసన అంటే పూజ, మర్యాద, పీట, శరభ్యాసము (విలువిద్య), హింస,సేవ, మననము (గుర్తుంచుకోవడము) అనే అర్థాలున్నాయి.

(ఈ) విశ్వాసముగల జంతువులలో కుక్క మొదటిది. శ్వానము, సారమేయము, గ్రామసింహము, కుక్కురము, , మృగదంసువు, జాగిలము, భషకము, గబ్బి, వేపి అనే పేర్లున్నాయి. మనకు చిరపరిచితమైన మరోపేరు కూడా వుంది.చెప్పగలరా ?

(ఉ) అక్కడ ఉడ్డా నలుగురు లేరు ? ఆ మాత్రము దానికే ఇంతగా ఏర్పాట్లా ?

తెలుగు అంకెలలో ఉడ్డ అంటే నాలుగని అర్థము.

ఇంగ్లీష్ తెలుగులలో ఒకే అర్థాన్నిచ్చే జంటపదాలను ఉపయోగిస్తాము కదా ! ఉదా॥ గేటువాకిలి, కప్పుగిన్నె, బ్యాగుతిత్తి.

అలాగే తెలుగులో కూడా సమానార్థాన్నిచ్చే జంటపదాలు కూడా వున్నాయి. ఉదా॥ ఉగాదికి  గుడ్డబట్టలు తెచ్చుకోవాలి.గుడ్డబట్టలులాంటిదే ఉడ్డానలుగురు. ఇంకా తెలుగులో ఇలా సమానార్థాలు ఇచ్చే జంటపదాలను మూడింటిని చెప్పండి.

(ఊ) చంద్రునకు జాబిల్లి అనేపేరు ఎలా వచ్చిందో తెలుసా ? చెవులపిల్లిని తనలో కలవాడు కనుక జాబిల్లి అయినాడు. చందమామ కథల పుస్తకములో జాబిల్లి గుర్తు (లోగో) వుంటుంది, Google లో చూడండి. చెవులపిల్లి అనగా కుందేలు.

(ఎ) శివుడంటే శుభములు కలుగచేయువాడని అర్థము కదా ! మరి ఈశ్వరుడంటే ? అంటే స్వభావముచేతనే ఐశ్వర్యములు కలవాడు, పుట్టుకతోనే ఐశ్వర్యములుకల దేవుడు.

(ఏ) కీరాటుడంటే వేటగాడని తెలుసు. వేట సమయములో కీ అంటూ శబ్దముచేస్తాడు కనుక కీరాటుడు అంటారు. వ్యాపారము కొరకు ఒక ప్రదేశమునుండి మరో ప్రదేశానికి తిరుగుతుంటారు కనుక కోమట్లను కూడా కీరాటులు అంటారు. కిరాతకుడు అనగా నెమిలి పింఛము ధరించి అడవిలో తిరుగువాడని అర్థము.

(ఐ) చిన్నారిపొన్నారి.

కాశీఖండం అవతారికలో శ్రీనాథుడు "చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాడు రచియించితి మరుత్త రాట్చరిత్ర." అని చెపుకొన్నాడు.

"చిన్నారి పొన్నారి పువ్వు

విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వూ"

అనే పాటను నాదీ ఆడజన్మే చిత్రము కోసము దాశరథీ పాటను వ్రాశాడు.

"చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య" అంటూ ఆచార్య అత్రేయ స్వాతిముత్యము సినిమాకోసం ఓ పాట వ్రాశారు.

ఇంతకు చిన్నారిపొన్నారి అంటే ఏమిటో తెలుసా ?  చిన్నదైనది మరియు మనోజ్ఞమైనదిని అర్థము. చిఱుత అంటే చిన్న,చిన్నది అని అర్థము.

Post a Comment

0 Comments