GET MORE DETAILS

మనకు నిధినిక్షేపాలు దొరికితే ఏమి చేయాలి ? (Indian Treasure Trove Act - 1871)

 మనకు నిధినిక్షేపాలు దొరికితే ఏమి చేయాలి ? (Indian Treasure Trove Act - 1871)



మనకు నిధినిక్షేపాలు దొరికితే ? దొరికితే ఎవరికి తెలియకుండా దాచేసుకోవడం చట్టరీత్యా తప్పు అంతేకాదు నేరము కూడా. కాబట్టి అవి దొరగ్గానే ప్రభుత్వానికి అప్పగించేయాలి, చేస్తారు కదా !

ఇంతకు నిధి అంటే ఏమిటి ? నిక్షేపమంటే ఏమిటో తెలుసుకోవాలి కదా ! 

మనము కాని మనపూర్వీకులు కాని ఉద్దేశ్యపూర్వకంగా ధనాన్ని, బంగారువెండి ఆభరణాలు , వజ్రవైడూర్యమరకతమాణిక్యాల వంటి రత్నాలు క లేదా మరేదైన విలువైన సంపదను, రాజు, ప్రభుత్వాధికారులు, దొంగలు, దాయాదులు,బంధువుల మొ॥వారిభయంతో భూమిలోకాని, ఇంటిలోగిలలో కాని, ఇంటిగోడలలో కాని బావులు మొదలైన వాటిచోట్ల దాచివుంచితే, కొన్నాళ్ళ తరువాత అది మనకు కాకుండా అంటే దాచివుంచిన వారికి కాకుండా ఇతరులకు   యాదృచ్ఛికంగా  దొరికితే దానిని నిధి అంటారు.

భూమిలోపల సహజసిద్ధంగా ఏర్పడివున్న విలువైన సంపదలు మనకు దొరికితే దానిని నిక్షేపమంటారు. భూమిలోపల బంగారు, మరకత, మాణిక్యగోమేధికము వంటి ముడి నవరత్నాలు కాని లేదా ఇతర విలువైన సహజసిద్ధమైన వస్తువులు మనకు దొరికితే దానిని నిక్షేపమంటారు.

మనకు నిధినిక్షేపాలు దొరకగానే ప్రభుత్వానికి ఏ విధంగా అప్పగించాలో ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ - 1871 ( Treasure Trove Act - 1871) ఏం చెబుతుందో చూద్దాము.

ఈ చట్టప్రకారముTreasure ( ధనము) అనగా 10 రుపాయలు లేదా ప్రభుత్వము నిర్ణయించిన వెల కల వస్తువు భూమిలోపల నూరు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వుండి అది మానవప్రయత్నము ద్వారా  లేదా ప్రకృతివలన కాని బయటపడి దొరికితే  వాటిని Treasure Trove సంపద అని అంటారు.

ఇలాంటి నిధినిక్షేపాలు దొరకగానే దొరికిన వ్యక్తి, లేదా వాటిని స్వాధీనము చేసుకొన్న వ్యక్తి లేదా కొన్నవ్యక్తి వెంటనే సమీపములోని రెవెన్యూ అధికారులకు మౌఖికంగా కాని లేదా వ్రాతపూర్వకంగా కాని తెలియచేయాలి. ఆ రెవెన్యూ అధికారి వెంటనే వాటిని పెద్దమనుషుల సమక్షములో పంచానామా ద్వారా స్వాధీనము చేసుకొని జిల్లాకలెక్టరుకు నివేదిక సమర్పించి వారి ఆధ్వర్యములో ప్రభుత్వ ఖజానాలో భద్రపరచాలని సెక్షన్ -VII ఆఫ్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ - 1959 తెలియచేస్తోంది. ఆఫ్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ - 1871 కు అనేక సవరణలు జరిగాయి.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యవిషయము ఏమిటంటే నిధినిక్షేపాల దొరికినస్థలము దొరికిన విధానము,నిధినిక్షేపాల స్వభావము అనగా రంగురూపము బరువు వంటి అంశాలతోపాటు ప్రస్తుత దాని అంచనా విలువను కూడా నిధినిక్షేపాలు దొరికిన వ్యక్తి, స్వాధీనము చేసుకొన్న వ్యక్తి, కొన్నవ్యక్తి, లేదా రెవెన్యూ అధికారులు స్పష్టంగా పెర్కొనాలి.

Treasure Trove Act -1949 సెక్షన్ 5 మరియు ప్రకారము ఆ జిల్లాకలెక్టరు పక్షము రోజులలోగా ప్రజల నిమిత్తము ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, నిధినిక్షేపాల వివరాలు తెలియచేస్తూ వాటికి ఎవరైనా స్వంతదారులు హక్కుదారులు వారసులు వున్నారేమో తెలుసుకోవాలి నిర్ణితగడువును ప్రజ ఇవ్వాలి.

నిర్ణితగడువులోగా ఏలాంటి క్లైములు దాఖలుకాకపోతే లభించిన నిధినిక్షేపాలను చట్టములోని సెక్షన్ - 9 ప్రకారము ప్రభుత్వఆస్తిగా ప్రకటించాలి. ఒకవేళ స్వంతదారు, వారసులు హక్కుదారుడు ఆ నిధినిక్షేపాలు మావేనని క్లైము చేస్తే, జిల్లాకలెక్టరు జరిపి నిర్ణయము తీసుకోవాలి.

నిధినిక్షేపాలు దొరికిన వ్యక్తి,లేదా స్వాధీనము చేసుకొన్న వ్యక్తి లేదా కొన్నవాడు నిధినిక్షేపాలు దొరికిన విషయము ప్రభుత్వానికి తెలియచేయకపోతే ఈ చట్టములోని సెక్షన్ - 20 ప్రకారము వారిపై భారతశిక్షాస్మ్రతి (IPC) ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

ఈ వ్యాసము అవగాహన కొరకు మాత్రమే, అవసరముంటే సంబంధిత చట్టాల గురించి తెలుసుకోండి.

Post a Comment

0 Comments