GET MORE DETAILS

నోరుకొట్టుకుంటూ ఓటికుండలు సమాధిమీద పగులగొడితే వానలు కురుస్తాయా !

నోరుకొట్టుకుంటూ ఓటికుండలు  సమాధిమీద పగులగొడితే వానలు కురుస్తాయా...!



14 వ శతాబ్ది కవి దోనయామాత్యుడు వర్షాల గురించి ఎమన్నాడో !

వానరాకడ ప్రాణంపోకడ ఎవ్వరూ చెప్పలేరని లోకంపోకడ. నిజమే వర్షము ఎప్పుడు ఎంత కురుస్తుందో వాతావరణశాఖ ఖచ్చితంగా చెప్పలేదు. అలాగే మనిషి ప్రాణమెప్పుడు పోతుందో కూడా ఏ వైద్యుడు చెప్పలేడు.

 ప్రకృతిని పరిశీలించి వానలెప్పుడు పడతాయో చెప్పగలిగిన సమర్థుడోకడు పూర్వముండేవాడు.అతనే దోనయామాత్యుడు.

14 వ శతాబ్దికి చెందిన ఈ కవి గురించి తెలిసిన నేటి సాహితీకారులు తక్కువనే చెప్పాలి.దోనయామాత్యుడు 14 వ శతాబ్దానికి చెందిన తెలుగుకవి.ప్రకృతిని ఖగోళశాస్త్రాన్ని రోదసిగుణాలను ఔపోసన పట్టిన ఘనుడు.రైతాంగానికి మేలు చేకూర్చేవిధంగా సస్యానందము అనే గ్రంథము వ్రాశాడు.సస్యము అంటే పైరు. పైరు అంటే పంట, పంటలు ఎప్పుడు ఆనందంగా వుంటాయి, సకాలములో వర్షాలు కురిసినప్పుడే కదా! ఆ వర్షాల గురించి సస్యానందములో వ్రాశాడు.

చుక్కలు దిక్కులు గాలులు మేఘాలు మంచులు ఎండలు వెన్నెలలు జంతువులు మొదలైనవాటిని పరిశీలించిన దోనయామాత్యుడు వర్షాలు ఎప్పుడు ఎలా కురుస్తాయో చెప్పాడు.

(1) ఆషాఢమాసములో పాడ్యమిరోజు మృగశిర నక్షత్రముతో కలిసి వున్నప్పుడు, సూర్యుడు అస్తమించే సమయములో పడమర దిక్కున దట్టంగా మేఘాలు కమ్మితే ఆ యేడు వర్షాలు దండిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి.

(2) మెట్టకప్పలు అంటే నీల్లలో లేని కప్పలు బెకబెకలాడినప్పుడు, జంతువులు నీల్లలో దిగి అలాగే నిలచినప్పుడు, తొండలు తామరలలో పొర్లినప్పుడు, కొలనులో చిన్నచిన్న చేపలు ఎగిరినప్పుడు వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయి, అకారణంగా పశువులు తోకలెత్తుకొని అంభా అంటూ అరచుకొంటూ గ్రామంలోనికి పరుగుపరుగున వచ్చిన సంవత్సరములో పంటలు సమృద్ధిగా పండుతాయి.

(3) చీమలు సంతోషంగా గుడ్లను నోటకరచుకొని బారులుగా పోయినా, నాగులు మట్టిలో పొర్లినప్పుడు, గోవులు అకస్మాత్తుగా పుట్టల మీదికి ఎక్కినప్పుడు బాగా వర్షాలు కురుస్తాయి.

(4) దుప్పట్లు నేసే ముతకనూలుతో రైతులు ఎనిమిది మూరలపొడవు రెండుమూరల వెడల్పుతో ఒక తెల్లటి వస్త్రాన్ని నేయించి పెట్టుకోవాలి.ఆషాడశుద్ధ పౌర్ణమినాడు ఉదయాన ఆ వస్త్రాన్ని 42 మూరలపొడువున్న వంకరలేని కర్ర చివరన కట్టి జెండాలా ఎగురవేయాలి.ఆ పతాకము ఏ వైపుకు మల్లుతుందో చూడాలి.ఆ పతాకము తూర్పుముఖంగా ఎగిరితే అన్ని కార్తెలలో వానలు బాగా పడతాయి. ఆగ్నేయదిశగా ఎగిరితే ఆ యేడు వానలు కురవక క్షామము ఏర్పడుతుంది.

 జెండా దక్షణదిక్కుకు కాని నైబుుతి దిక్కుకు కాని తిరిగితే మేఘాలు దట్టంగా పడతాయి కాని వానలు కురవవు. పడమర దిక్కుకు ఎగిరితే అతివృష్టి, ఉత్తరదిక్కుగా తిరిగితే కూడా వర్షాలు బాగా కురుస్తాయి. జెండా ఈశాన్యదిక్కుగా ఎగిరితే పంటలు మధ్యస్థంగా పండుతాయి.ఏ కారణము చేతనైనా జెండా అన్నిదిక్కులకు ఎగిరితే పంటలు పండి పాడైపోతాయి.

(5) పుష్యమాసములో పున్నమి దినాన  కొద్దిగా పత్తిని తీసుకొని నాగలికి కట్టి ఆరుబయట పెట్టాలి, నాగలికి అడ్డుగా ఏమి వుండరాదు.చంద్రరశ్మి, మంచు ప్రత్యక్షంగా నాగలిపై పడాలి. సూర్యోదయము కాకమునుపే దూదిని తీసుకొని పిండాలి, మంచుకు తడిసిన ఆ ప్రత్తినుండి నీరు ధారగాపడితే ఆ  వానలు పుష్కళంగా కురుస్తాయి. కొన్నికొన్ని చుక్కలే పడితే ఆ యేడు వర్షాలు మధ్యరకంగా కురుస్తాయి.

ఎంత పిండినా నీటిచుక్క జారకపోతే ఆ సంవత్సరము వర్షపాతము తక్కువగా వుంటుంది.

ముంగారులో వర్షాలు పడకపోతే రైతులు గ్రామస్తులు విరాటపర్వపారాయణం చేయడము, వరుణయాగము చేయడము, ఉప్పుతెచ్చే ఆటను పురుషులు ఆడటము ( ఈ ఆటను సురవరము ప్రతాపరెడ్డి గారు ఆంధ్రులసాంఘిక చరిత్రలో ఉదాహరించారు) కప్పలకు పెండ్లి చేసి ఊరేగించడము, గ్రామములో ఎవరో పాపాత్ముడు చనిపోయాడని అందుకే వర్షాలు కురవడము లేదని, పది సంవత్సరాలలోపు పిల్లలను కొంతమందిని జతచేసి, ఓటికుండలు కొందరు పిల్లలతో మోయిస్తూ ఇంకొందరు నోరుకొట్టుకుంటూ అతని ఒలికిలి దగ్గరకు వెళ్ళి ఆ సమాధిమీద నెర్రెలుచీలిన కుండలు పగులగొట్టడము,

గ్రామములోని బొడ్రాయికి నూటొక్క కుండలతో జలాభిషేకము చేయడము, గ్రామదేవతను ఊరేగించడము, ఇంట్లో ఊర్లోవున్న పాతవిసుర్రాళ్ళ (తిరుగలి రాళ్ళ )ను, పగిలిన విగ్రహాలను,పాతచీపురులను, చేటలను ఊరి బయట పారేయడము చేసేవారు.

పైవన్ని అంధవిశ్వాసాలుగా కొట్టిపారేసినా, ఇలా చేసినప్పుడు వర్షాలు కురిసిన సందర్భాలు అనేకంగానే వున్నాయి.

Post a Comment

0 Comments