GET MORE DETAILS

అప్పు చేసి పప్పు కూడు అంటే ఏమిటి ? ఈ సామెతను ఎటువంటి సందర్భంలో వాడుతారు ?

అప్పు చేసి పప్పు కూడు అంటే ఏమిటి ? ఈ సామెతను ఎటువంటి సందర్భంలో వాడుతారు ?



అప్పు చేసి పప్పు కూడు అనేది తెలుగులో బాగా ప్రసిద్దికెక్కిన సామెతలలో ఒకటి.ఇది డాబులకు పోయి ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసే వారి గురించి వాడుతారు. తమ తాహతుకన్నా మించి జీవించాలంటే మార్గం ఒకటే - అప్పు చేయడం. ఏదో చలనచిత్రం లో ఒక చెణుకు ఉంది అప్పిచ్చే వారుంటే విమానాన్ని కూడా కొనేదానికి సిద్దమయి పోతారు కొందరు మధ్యతరగతి వారు, ఆ వస్తువు వారికి అవసరమా కాదా అనేది అనవసరం . ప్రాప్తకాలజ్ఞత ఉండే వారు ఈ రోజు చక్కగా గడిచిపోతే చాలనుకొంటారు. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అనేది వారి సిద్దాంతం. పప్పన్నం అనేది విందు భోజనానికి ప్రతీక.

Post a Comment

0 Comments