GET MORE DETAILS

ప్రపంచ హృదయ దినోత్సవం: సెప్టెంబర్ 29'

 ప్రపంచ హృదయ దినోత్సవం: సెప్టెంబర్ 29'



ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొంటారు.

చరిత్ర:

గుండెపోటు, గుండె జబ్బులను నివారించడంకోసం 1946లో జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపాడు. అలా 2000 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది.[2] 2010 వరకు సెప్టెంబరు నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించబడిన ఈ దినోత్సవం, 2011వ సంవత్సరం నుంచి సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించబడుతోంది.

కార్యక్రమాలు:

గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన కలిగించడం మొదలైన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రచారం చేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ,వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా దాదాపు 100 దేశాలలో 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటుచేసి వాటిద్వారా ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం, నడక పరుగులకు సందబంధించిన ఆటలు ఆడించడం, బహిరంగ చర్చలు సైన్స్ ఫోరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాలు మొదలైనవి గుండె ఆరోగ్యం, ఇతరుల బాధ్యతలను స్వీకరించే కార్యకలాపాల్లో పాల్గొంటాయి. ఈ ప్రచారం ద్వారా అన్ని దేశాల ప్రజలను ఏకంచేసి, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కార్యక్రమాలను నడిపిస్తుంది.

Post a Comment

0 Comments