GET MORE DETAILS

ఈనెల 6 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం : సచివాలయాల్లో బుకింగ్ కు అవకాశం.

ఈనెల 6 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం : సచివాలయాల్లో బుకింగ్ కు అవకాశం.







సదరం ద్రువీకరణ పత్రాలు పొందేందుకు ఈ నెల ఆరో తేదీ నుంచి స్లాట్ బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 171 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. 

ఏ జిల్లాలోనైనా అవకాశం..!

గతంలో ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాలోని ఆ ఆస్పత్రుల్లోనే స్లాట్ బుక్ చేసుకుని స్క్రీనింగ్ కు హాజరుకావాల్సి ఉండేది. విద్య, ఉపాధి, కుటుంబ అవసరాల నిమిత్తం ఇతర జిల్లాల్లో నివసించే ప్రజలు సదరం సర్టిఫికెట్ పొందడానికి సొంత జిల్లాకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా సదరం స్క్రీనింగ్ కు హాజరై సర్టిఫికెట్లు పొందడానికి ప్రభుత్వం గత జూలై నుంచి అవకాశం కల్పించింది. 

సులభంగా - అధికంగా :

అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో కేవలం 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించారు. స్లాట్లు కూడా తక్కువగా ఉండేవి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం స్లాట్ బుకింగ్ నుంచి సర్టిఫికెట్ల జారీ వరకు సులభంగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్ లకు అవకాశం కల్పించింది. సదరం పరీక్షలు నిర్వహించే ఆస్పత్రుల సంఖ్యను 171కు పెంచింది. దీంతో టీడీపీ 

ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సులభంగా సదరం సేవలు ప్రజలకు లభిస్తున్నాయి. ఈ క్రమంలో సర్టిఫికెట్ల జారీ సంఖ్య కూడా పెరిగింది. టీడీపీ ప్రభుత్వంలో ఏడాదికి 25 వేల నుంచి 30వేల వరకు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేసేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019-20లో 77,385 సర్టిఫికెట్లు, 2020-21లో 70,570 సర్టిఫికెట్లు, 2021-22లో 91,225 సర్టిఫికెట్లు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 36వేలకు పైగా సర్టిఫికెట్ లు మంజూరు చేశారు.

Post a Comment

0 Comments