GET MORE DETAILS

చలికాలంలో పిల్లల పెదవులకు...

 చలికాలంలో పిల్లల పెదవులకు...



చలి గాలులకు పిల్లల పెదవులు కూడా పొడి బారి పగులుతుంటాయి. చిన్న చిట్కాలతో ఈ పగుళ్లను తగ్గించవచ్చు.


▪️నెలల పిల్లలకు తరచుగా పెదవులు ఎండినట్లయి నల్లగా మారి పగులుతుంటాయి. అలాంట ప్పుడు తల్లిపాలతో పిల్లల పెదవులు తడిచేలా చేస్తే సరిపోతుంది.


▪️ఇంట్లో తయారుచేసిన లేదా రసాయనాలు కలుపని కొబ్బరి నూనె, బాదం నూనె, నెయ్యిలలో ఒకదాన్ని పిల్లల పెదవుల మీద రాస్తూ ఉంటే పగుళ్లు తగ్గుతాయి. శీతాకాలంలో పిల్లలను బయటికి తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఇలా చేయాలి.


▪️వాతావరణం అత్యంత పొడిగా ఉందనిపిస్తే ఇంట్లో హ్యుమిడిఫయర్ను ఏర్పాటు చేయడం మంచిది.


▪️గరుకుగా మారిన పెదవుల మీద లిప్బామ్, కోల్డ్ క్రీమ్ లాంటివాటిని రాయకూడదు. పాల మీగడ రాస్తే ప్రయోజనం ఉంటుంది.


▪️కలబంద గుజ్జు, తేనెలలో ఒకదాన్ని పెదవులకు రాసి వేలితో మెల్లగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే తేమ నిండి పెదవుల పగుళ్లు తగ్గుతాయి.


▪️చిన్న గిన్నెలో ఒక చెంచా బీట్రూట్ రసం, ఒక చెంచా పంచదార వేసి ఒకసారి కల పాలి. వెంటనే ఈ మిశ్రమాన్ని పిల్లల పెదవుల మీద రాసి వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తరు వాత నీళ్లతో కడిగి కొద్దిగా నెయ్యి రాస్తే ప్రయోజనం కనిపిస్తుంది.

Post a Comment

0 Comments