GET MORE DETAILS

చియా సీడ్స్ వీరికి విషంతో సమానం.. పొరపాటున కూడా తినకూడదు!

చియా సీడ్స్ వీరికి విషంతో సమానం.. పొరపాటున కూడా తినకూడదు!



చియా సీడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, కొందరికి మాత్రం హాని చేస్తుందట. మరి, చియా సీడ్స్‌ని ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి శరీరానికి కూలింగ్‌ని ఇచ్చే ఫుడ్స్, డ్రింక్స్‌ని తాగుతుంటాం. అందులోనూ ఎక్కువగా చియా సీడ్స్‌ని (Chia Seeds) వాటర్‌తో పాటు వివిధ రకాల డ్రింక్స్, స్మూతీల్లో యాడ్ చేసుకుంటాం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్, డైటరీ ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం వంటి కీలక పోషకాలు ఉంటాయి.ఇవి హార్ట్ హెల్త్, వెయిట్ మేనేజ్‌మెంట్‌తో పాటు బ్లడ్ షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, కొందరికి మాత్రం హాని చేస్తుందట. మరి, చియా సీడ్స్‌ని ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

మెడిసిన్ వాడేవారు రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు అది నిరంతరం పలుచగా ఉండటానికి కొన్ని రకాల మెడిసిన్ వాడుతుంటారు. ఆస్పిరిన్, వార్‌ఫరిన్, ఇతర యాంటీకోగ్యులెంట్లను నిత్యం వేసుకుంటారు. అయితే, ఇలాంటి వారు చియా సీడ్స్ తింటే ఇప్పటికే పలుచనైన రక్తం మరింత పలుచగా మారి బ్లీడింగ్‌కి దారితీయొచ్చు. ఎందుకంటే, ఈ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తాన్ని పలుచన చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు, అధిక ఫైబర్ మెడిసిన్ల శోషణాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా బ్లడ్ థిన్నర్స్ వాడేవారు చియా సీడ్స్‌ని అవాయిడ్ చేయాలి. 

కిడ్నీ వ్యాధి బాధితులు చియా సీడ్స్‌లో ఫాస్పరస్ కంటెంట్ అతి ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇందులోని ఫాస్పరస్ వారి ఆరోగ్యాన్ని మరింత దిగజారేలా చేస్తుంది. ఇది క్యాల్షియం బ్యాలెన్స్‌ని డిస్టర్బ్ చేసి కిడ్నీ పనితీరును దెబ్బతీస్తుంది. దానిపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుడి సిఫార్సు మేరకు మాత్రమే వీటిని వాడాలి.జీర్ణ సమస్య బాధితులు ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS), దీర్ఘకాలిక కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా పొత్తికడుపు నొప్పి, సున్నితమైన జీర్ణ వ్యవస్థ కలిగిన వారు చియా సీడ్స్‌కి దూరంగా ఉండాలి. వీటిల్లో ఫైబర్ కంటెంట్ అతి ఎక్కువగా ఉంటుంది. 

ఇది ఆరోగ్య పరిస్థితులను మరింత తీవ్రం చేస్తుంది. పేగుల్లో చికాకును కలిగించి ఐబీఎస్ లక్షణాలను మరింత దుర్భలం చేస్తుంది. దీంతోపాటు, ఎక్కువ సేపు కడుపు ఉబ్బిన భావనను కలిగిస్తుంది. గ్యాస్, క్రాంప్స్ కూడా రావడానికి కారణం అవుతుంది. అలర్జీ బాధితులు కొందరికి సీడ్ లేదా నట్ అలెర్జీలు ఉంటాయి. ఇలాంటి వారు సైతం చియాను అవాయిడ్ చేయాలి. చియాలోని గుణాలు అరుదుగా అలెర్జీని కలిగిస్తుంటాయి. చర్మంపై దురద, వాపుని కలిగిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీంతోపాటు, జీర్ణ వ్యవస్థ అప్‌సెట్ అవుతుంది.సేఫ్టీ టిప్స్ ఇలాంటి కండిషన్లతో పాటు ఆరోగ్యవంతులు సైతం చియా సీడ్స్ విషయంలో కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. వీటిని నేరుగా అస్సలు తినకూడదు. అలా తింటే ఫుడ్ పైప్ మూసుకుపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో, శరీరం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాబట్టి, ఎల్లప్పుడూ నీటిలో కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాకే తినాలి. ఇది ఆహార నాళంలో సులువుగా జారడానికి హెల్ప్ చేస్తుంది.

Post a Comment

0 Comments