GET MORE DETAILS

వాల్మీకి మహర్షి

 వాల్మీకి మహర్షి



ఆదికావ్యం రామాయణం వ్రాసిన వాల్మీకి  ప్రచేతనుడనే ముని కుమారుడు.

అడవిలో తప్పిపోగా ఒక బోయవాడు పెంచుకున్నాడు. యుక్త వయసు వచ్చాక దోపిడీలతో సంపాదించి కుటుంబం పోషించేవాడు.

ఒకనాడు నారదమహర్షి కలిసి దోపిడీ చేయడం పాపమని తన పాపంలో తల్లిదండ్రులు భార్యా బిడ్డలు పాలుపంచుకో గలరేమో తెలుసుకోమంటాడు.తమను పోషించే బాధ్యత తనది కనుక వారు నిరాకరిస్తారు.

జ్ఞానోదయమైన రత్నాకరునికి నారదుడు రామనామం ఉపదేశించి తపస్సు చేయమంటాడు. రత్నాకరుడు సంవత్సరాల పాటు తపస్సు చేయగా చుట్టు పుట్ట పెరుగుతుంది.

నారదురు మళ్లీ వచ్చి పిలువగా పుట్ట(వల్మీకం)లో నుండి బయటకు వస్తాడు.కనుక వాల్మీకి అని పిలువబడతాడు. నారదుని సలహాతో రామాయణ కావ్యాన్ని సంస్కృతంలో వ్రాసాడు.

ఒకానొక సమయం లో క్రౌంచపక్షులలో ఒకదానిని చంపిన వేటగాన్ని శపించిన వాక్యాలు శ్లోకంగా వెలుబడినాయి.

సీతను అడవులకు పంపిన తర్వాత చేరదీసి తన ఆశ్రమంలో నీడనిచ్చాడు.

 జన్మించిన లవ కుశు లకు విద్యాబుద్ధులు నేర్పి రామాయణ గాధను గానం చేయించాడు. లవకుశులు రాముని సమక్షంలో గానం చేయగా రాముడు నిజం తెలిసికొని సీతను కలిసాడు.

రాముని కలిసిన సీత తదుపరి తన తల్లి భుాదేవిని వేడుకొని భుామిలోనికి వెళ్లిపోయింది.

వాల్మీకి లవకుశులను శ్రీరామునికి అప్పగించాడు. శ్రీరాముడు వారిని పట్టాభిషేకము చేసాడు.

Post a Comment

0 Comments