GET MORE DETAILS

"కరోనా తగ్గినా ఇంకా పొడి దగ్గు"...?



"సమస్య " :నాకు నాలుగు నెలల క్రితం కొవిడ్‌ వచ్చి తగ్గింది. కానీ ఇంకా పొడి దగ్గు వస్తూనే ఉంది. పగటి వేళ బాగా ఇబ్బంది పెడుతోంది. కూర్చున్నా, నిల్చున్నా దగ్గు వస్తుంది. పడుకున్నప్పుడు రాదు. బుడేకార్ట్‌ ఇన్‌హేలర్‌ వాడితే ఉపశమనం కలుగుతుంది. పరీక్షల రిపోర్టులు, సీటీ స్కాన్‌ అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయినా దగ్గు ఎందుకు వస్తోంది? దీనికి పరిష్కారమేంటి?

- డాక్టర్.సి.హెచ్.సంపత్ కుమార్

'సలహా' :

కొవిడ్‌-19 తగ్గిన తర్వాత కూడా 10-15% మందికి దీర్ఘకాలం దగ్గు రావటం చూస్తున్నాం. ఇలాంటి వారిలో అప్పటికే కాస్త అలర్జీ కూడా ఉంటోంది. కొందరికి కొవిడ్‌-19 మూలంగా ఊపిరితిత్తుల్లో కణజాలం గట్టిపడొచ్చు (లంగ్‌ ఫైబ్రోసిస్‌). ఇది జబ్బు తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కొవిడ్‌-19 తీవ్రమైనవారిలో నాలుగైదు నెలల వరకు లోపల ఇది మచ్చల రూపంలో అలాగే ఉంటుంది. దీంతోనూ దీర్ఘకాలం దగ్గు వేధించొచ్చు. అందువల్ల మీకు ముందుగా మామూలు ఛాతీ ఎక్స్‌రేతో పాటు అలర్జీ పరీక్షలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే స్పైరోమెట్రీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. దగ్గు అలర్జీతో వస్తోందా? ఆస్థమాతో వస్తోందా? అనేది వీటితో బయట పడుతుంది. దీని ప్రకారం మందులిస్తే తగ్గిపోతుంది. ఒకవేళ కణజాలం గట్టిపడినట్టయితే నాలుగైదు నెలల వరకు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు దగ్గు రావటం లేదని అంటున్నారు. నిజంగా జబ్బుతో అయితే పడుకున్నప్పుడూ దగ్గు రావాలి. ఆ మాటకొస్తే ఆస్థమా, అలర్జీతో వచ్చే దగ్గు రాత్రిపూట ఎక్కువగా వస్తుంది కూడా. మీరు అతిగా ఆలోచించటమో, ఇంకేదైనా మానసికంగానో బాధపడుతూ ఉండొచ్చేమోనని అనిపిస్తోంది. దీంతోనూ పగటి పూట దగ్గు రావొచ్చు. పనిచేసే చోట దుమ్ము ధూళి వంటివి పడటం లేదేమో కూడా చూసుకోవాలి. మీరు దగ్గర్లోని పల్మనాలజిస్టును సంప్రదిస్తే తగు పరీక్షలు చేసి, అవసరమైన మందులు సూచిస్తారు. కంగారు పడాల్సిన పనిలేదు.

Post a Comment

0 Comments