GET MORE DETAILS

అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్.

 అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్.





సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ తాజా ప్రయోగంతో భారత్ ఆ దేశానికి గట్టి సందేశం పంపింది. అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ క్షిపణిని చైనా లక్ష్యంగా తయారు చేసిందే.

"నైట్ ఆపరేషన్ మోడ్’’లో ఈ పరీక్ష నిర్వహించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. క్షిపణి దిశ, వేగాలను పరీక్షించినట్లు పేర్కొన్నాయి. 15 నిమిషాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి ఢీకొట్టినట్లు వార్తలు.

భారత రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది ఉపరితలం నుంచి వాయుతలంలోకి (సర్ఫేస్ టు ఎయిర్) ప్రయోగించగలిగే దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. 5,000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలపై దీని సాయంతో దాడిచేయొచ్చు.

కానీ ఈ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి 8000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలపై దాడి చేయగలదని చైనాతో పాటు అగ్ర రాజ్యాలు కూడా చెపుతున్నాయి అంటే చైనా మొత్తంతోపాటు ఆఫ్రికా, ఐరోపాలలోని కొన్ని ప్రాంతాల్లోని లక్ష్యాలపై ఈ క్షిపణి సాయంతో దాడులు చేసేందుకు వీలుపడుతుంది.

అగ్ని-5 క్షిపణిని ఎప్పుడో ప్రయోగించాలి అయితే చైనా గత రెండు మూడు నెలల నుండి తన స్పై షిప్ ను అగ్ని-5 క్షిపణి ప్రయోగం కోసమే శ్రీలంకలో నిఘా పెట్టింది. భారత్ అభ్యంతరం చెప్పేసరికి అక్కడ నుంచి భారత్ సముద్ర జలాల అంతర్జాతీయ సరి హద్దుల దాటిన తరువాత చైనా తన స్పై షిప్ ను నిఘా పెట్టింది..

తాజా పరీక్ష మాత్రం కీలకమైనది. ఎందుకంటే దీన్ని ఎలాంటి విదేశీ సాయం అవసరం లేకుండా ‘‘స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్’’ పరీక్షించింది.

భారత్‌లోని అణ్వాయుధాలు ‘‘స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్’’ పర్యవేక్షణలో ఉంటాయి..

Post a Comment

0 Comments