GET MORE DETAILS

హిందీ నేర్చుకుందాం : (నేడు ప్రపంచ హిందీ భాషా దినోత్సవం)

 హిందీ నేర్చుకుందాం : (నేడు ప్రపంచ హిందీ భాషా దినోత్సవం)




యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836


భారత దేశంలో అత్యధిక మంది ప్రజలు(ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు) హిందీ భాషను ఎక్కువగా మాట్లాడతారు. విభిన్న సంస్కృతులు, విభిన్న నాగరికతలు, విభిన్న భాషలు కలిగిన భిన్నత్వంలో ఏకత్వము కలిగిన ఏకైక దేశం మనదే.

 భారతదేశంలో దాదాపు సగం జనాభాకు  హిందీ మాతృభాషగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా మాట్లాడే రెండో భాషగా హిందీ ఉంది.

భారతదేశంలో హిందీ భాష ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాసతో కుడి ఉంటుంది. ఉదాహరణకు బీహార్ హిందీ లో కొంత భోజపురి మిళితమై ఉంటుంది. లక్నో హిందీలో కొంత ఉర్దూ మిళితమై ఉంటుంది.  కొన్ని రాష్ట్రాల్లో మాతృభాష దాదాపు హిందీ తో సమానంగా ఉంటుంది.

హిందీ భాష సంస్కృతము నుంచి ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. దీని యొక్క లిపి దేవనాగరి లిపి లాగా ఉంటుంది.

హిందీ భాష కూడా తెలుగు భాష లాగానే వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు మొదలైనవి ఉంటాయి.హిందీ భాష ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా అనుసంధానమైన భాషగా లేదా లింక్ లాంగ్వేజ్ గా ఉంటుంది.హిందీ భాష వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సగము దేశాలు తిరిగి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలలో ఉర్దూ, అరబ్బీ లాంటి భాషలు దాదాపు హిందీ తో సమానంగా ఉంటాయి. అదేవిధంగా నేపాలి భాష కూడా 80 శాతం హిందీ భాష లాగానే ఉంటుంది.

భారతదేశంలో దాదాపు సగముపైగా హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దీనిని అధికార భాషగా గుర్తించారు. ఈ భాష మన స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ హిందీలో ఉపయోగించి ఉపన్యాసాలు భారత ప్రజానీకాన్ని జాగ్రత్తము చేశారు. మహాత్మా గాంధీ ,జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటివారు ప్రసంగాలు అన్ని హిందీలోనే ఉండేవి. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఒకే భాష ఒకే మతం అనే నినాదంతో ముందుకెళ్తుంది. అయితే ఏ భాషనైనా ప్రజలు స్వేచ్ఛగా నేర్చుకోవాలి. ఆసక్తితో నేర్చుకోవాలి. ఎందుకంటే భావవ్యక్తీకరణ భాషలో భాగంగా ఉండాలి. ఎవరిపైనా ఏది బలవంతంగా రుద్ధకూడదు. ఆసక్తి ఉంటే ఒక భాషకు మించి ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు.ప్రభుత్వాలు ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలి.అలాగే నేర్చుకున్న భాషకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తే తప్పకుండా ప్రజలు వాటినిఆదరిస్తారు.నేర్చుకుంటారు.ఎదుటి వారి భాషను, యాసను కించ పర్చకూడదు.ఇది ఏ భాష మాట్లాడే వారికైనా వర్తిస్తుంది.అలాగే రచయితలను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహించాలి.పుస్తకాలని ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. అనువాదాలని ప్రోత్సహించాలి.అప్పుడే ఏ భాషైనా బతుకుతుంది.

Post a Comment

0 Comments