GET MORE DETAILS

మంత్రానికి చింతకాయలు రాలుతాయా...? మంత్ర జపం వల్ల రోగములు తగ్గుతాయా...?

మంత్రానికి చింతకాయలు రాలుతాయా...? మంత్ర జపం వల్ల రోగములు తగ్గుతాయా...?



ఒక చిన్న కర్రతోటి కింద రాలిపడే చింతకాయల కోసం మంత్ర శక్తిని వినియోగించుకోనక్కర్లేదు అన్నది ఆ నానుడిలోని అంతరార్థము. అంతేకానీ మంత్రం వల్ల రాలవు  అన్నది కాదు. 

మంత్రం జపిస్తే రోగాలు ఎలా తగ్గుతాయి అనే భౌతిక వాదులు ముందుగా మంత్ర శక్తి గురించి సరియైన అవగాహన కల్పించుకుంటే అప్పుడు దానిలోని విశేషం అవగతం అవుతుంది.

మంత్ర జపం యోగజపం కృత్వ పాప నివారణమ్, పరం మోక్ష మవాప్నోతి మానుషో నాత్ర సంశయః !

మానవుడు జ్ఞానమునకు నిధి, మంత్ర జపము వలన పాప నివారణ జరుగుతుంది..

మంత్రము అంటే మననము చేసినంతనే తరింప చేసేది.

అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలనే సాధ్యo. దాని వల్లనే తత్వ జ్ఞానము సిద్దిస్తుంది.

ఇతర జీవులలో జ్ఞాన గుణము లేదు. కేవలం పుణ్యము చేయడం వలనే మనుష్య జన్మ లభిస్తున్నది. అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవతా సమానమవుతున్నాడు. దేహము లేనిదే పురుషార్ధము సిధ్ధించదు. కనుక ఈ శరీరమును రక్షించుకొనుచూ జ్ఞాన ప్రాప్తికి సాధన చేయవలెను.

మననం చేయడం వలన కాపాడేది మంత్రం. మనస్సుకు చాంచల్య స్వభావం (ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అనుకోవడం) వుంటుంది.

ఈ చంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్నీ ఒకచోట చేరినప్పుడు అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి, అంతఃకరణానికి సంబంధం వుంది.

మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి.

మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్ధులు సిద్ధిస్తాయి. మంత్రజప సాధన వలన సిద్ధులు కలుగుతాయని యోగ దర్శనం చెబుతుంది..

ఎందరో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్ధులు సాధించారు.

సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరాయనునిగా, దుఃఖ వంతుడిని సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, దరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని జితేంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తేజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది.

అంధకారం నుండి ప్రకాశం వైపు మృత్యువు నుండి అమృతం వైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దుర్బుద్ధి నుండి సద్బుద్ధి వైపుకు తీసుకుపోతుంది. ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది.

మంత్రం అంటే అర్థం, లేని ధ్వని కాదు. అర్థవంతమైన శక్తి కలిగి ఉన్నది .

Post a Comment

0 Comments