GET MORE DETAILS

ఉగాది పండుగ ప్రాశస్త్యం

ఉగాది పండుగ ప్రాశస్త్యం



యుగానికి ఆదిగా జరుపుకునే పండగ ఉగాది. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను తెలుగు వారు జరుపుకుంటారు. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. వసంత ఋతువు కావటం చేత పకృతిలో ఉన్న చెట్లన్ని కొత్త లేత చిగుళ్లతో, పూల పరిమళాలతో పచ్చగా కళకళ లాడుతూ శోభాయమానంగా కనిపించే సుందర దృష్యాలను చూసి కోయిలలు పులకరించి మన వీనులకు విందు కలిగించే కమ్మని స్వరాలతో ఆనందింప జేస్తాయి.

తెలుగువాళ్ళు ఏటేటా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగలలో తొలిపండుగ ఉగాది.

ఈ పండుగకు మరికొన్ని పేర్లు : యుగాది, సంవత్సరాది.

ఉగాది : ఉగ – నక్షత్రగమనం , ఆది – నక్షత్రగమనం మొదలుపెట్టిన సమయం. అందువలన ఉగ + ఆది = ఉగాది.*

మరొక వివరణ : బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటిరోజు. ప్రభవనామ సంవత్సరం ఆదివారం వచ్చింది కనుక యుగ + ఆది  - యుగాది అయ్యింది.

"చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని

వత్సరాదే వసంతాదే రసరాద్సే తదైవచ "

చాంద్రమానం ప్రకారం చైత్రశుద్ద పాడ్యమి రోజున ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలవారు ఉగాది పండుగను జరుపుకొంటారు. అయితే తమిళులు, మలయాళీలు, మనలా చాంద్రమానం కాకుండా సౌరమానం పాటిస్తారు.

ఈ ఉగాది పండుగకు ప్రాంతాల వారిగా వివిధ పేర్లు ఉన్నాయి.

✨  తెలుగువారు – ఉగాది,

✨  మరాఠీవారు – గుదిపడ్వగా,

✨  తమిళులు – వర్షవరుప్పు,

✨  మలయాళీలు – విషు,

✨  సిక్కులు – వైశాఖీ,

✨  బెంగాలీలు – పోయ్ లా బైశాఖ్.

పేరు ఏదైనా ఈ పర్వదినం సర్వత్రా సంతోషాన్ని కలుగచేస్తున్నది.

Post a Comment

0 Comments