GET MORE DETAILS

యుగాది రోజు చేయాల్సిన 6 పనులు ఏమిటి...?

యుగాది రోజు చేయాల్సిన 6 పనులు ఏమిటి...?



చైత్ర శుద్ధ పాడ్యమి : 

పద్మ కల్పంలో ప్రభవ మెుదలుకొని అరవై మంది మహాత్ములు దక్షునికి పుట్టారు. వీరంతా శ్రీహరిని తమ తపస్సుతో మెప్పించారు. సంవత్సరాధిదేవతలుగా మారారు. అప్పటినుండి వీరి పేర్లు మీదుగా సంవత్సరాలు, ప్రభవ, విభవ మున్నగు నామాలతో పిలవబడుతున్నాయి. 

వీరందరి ఆవిర్భావం జరిగినదీ, వీరంతా సంవత్సరాధిదేవతలుగా మారినదీ చైత్రశుక్ల ప్రతిపత్తిథి. అందుకే ఆ రోజును "యుగాది"గా వ్యవహరిస్తారు. యుగాది లేక సంవత్సరాది ఏర్పడిన పవిత్ర మాసం చైత్రమాసం. 

యుగాది అను శబ్దమే యుగములకి ఆది. ఆ శబ్దమే 'ఉగాది'గా మారింది. దానినే సంవత్సరాది అని పిలుస్తాము. తెలుగు సంవత్సరము నందు ఆరంభమయ్యే తిథి కనుక చైత్రశక్ల పాడ్యమిని ఉగాది అని అంటారు. సంవత్సరం అంతా శుభ ఫలితాలు పొందాలంటే...

1. పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి అభ్యంగన స్నానం నలుగుతో ఒళ్ళు అంతా వ్రాసుకుని, తరువాత కుంకుడుకాయ పులుసుతో తలస్నానం చేయాలి.

 (షాంపూతో స్నానం పనికిరాదు). ఇలా చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని అగ్ని పురాణం చెబుతోంది. 

2. ఇష్ట దేవతారాధనతో పాటు ఈ రోజు తప్పక లక్ష్మీదేవి పూజ చేయాలి అని శాస్త్రం. 

3. శ్రీసూక్తం పారాయణం చేయడం లేక వినడం చాలా మంచిది. 

4. ఈ రోజు రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది, శివుని అన్నంతో అభిషేకించి, ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా  తీసుకున్నా, ఇతరులకు ప్రసాదం పంచినా జీవితంలో భుక్తికి లోటు ఉండదు అని శాస్త్రం. 

5. ఆ తరువాత వేప పూతతో చేసిన షడ్రుచుల పచ్చడిని రుద్రుడికి లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి. గురుదేవులను, నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించాలి. 

6. ఈరోజు తప్పక చేయవలసినవి. 

◆ ఆలయ దర్శనం

◆ సూర్యుడు అస్తమించే  లోపు పంచాంగ శ్రవణం

 (తిథి చూడడం వలన సంపదలు వస్తాయి . వారం చూడడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. నక్షత్రం చూడడం వల్ల పాపం తొలగుతుంది. యోగం చూడడం వల్ల రోగాలు తొలగిపోతాయి. కరణం చూడడం వల్ల కార్యసిద్ధి అవుతుంది అని శాస్త్రం) 

● అన్నదానం చాలా మంచిది. 

● గురుదర్శనం , గురుప్రదక్షిణ , వ్యాస భగవానుడి కథ వినడం చాలా శ్రేయస్కరం.

● సంధ్యాసమయంలో లక్ష్మీదేవికి దీపారాధన చేసినా, దీప దర్శనం చేసుకున్నా చాలా శుభప్రదం. 

● గోప్రదక్షిణ మఱియు గోపూజ చాలా మంచిది. 

● పురాణ శ్రవణం ఎంతో ఉత్తమం. మత్స్య మరియు స్కాంద పురాణములు గురువులకి దానం ఇవ్వడం చాలా మంచిది.

Post a Comment

0 Comments